సీఎం పర్యటనకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

On
సీఎం పర్యటనకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

 

నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం

 

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా ఏర్పాట్ల పురోగతిని శుక్రవారం పరిశీలించి, వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం ముఖ్యమంత్రి పర్యటనకు అనుగుణంగా తీర్చిదిద్దే పనుల్ని కలెక్టర్ విభాగాల వారీగా పరిశీలిస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆడిటోరియం, హాస్టల్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లు, అంతర్గత రహదారుల మరమ్మత్తు,  వంటి కీలక ప్రదేశాలను సందర్శించి, పనుల పురోగతిపై  ఇంజనీరింగ్ మరియు యూనివర్సిటీ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రతీ పని  వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆలస్యానికి కారణమయ్యే అంశాలు ఏవైనా ఉంటే వెంటనే నివేదించాలని, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
యూనివర్సిటీ మొత్తం పరిశుభ్రత మరియు పచ్చదన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రతి విభాగాన్ని అందంగా మార్చేందుకు ఎంపీడీవోలను ప్రత్యేక విభాగాలకు కలెక్టర్ నియమించారు.  గ్రౌండ్ లెవెలింగ్, మొక్కలు నాటడం, రోడ్ల పక్కన హార్టికల్చర్ పనులు, చెత్త తొలగింపు వంటి సుందరీకరణ కార్యక్రమాలు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన రోజున యూనివర్సిటీ ఒక ఆదర్శవంతమైన విద్యాసంస్థగా కనిపించాలనే లక్ష్యంతో పనుల్ని అమలు చేయాలని ఆయన సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటనలో ఏలాంటి లోపాలు లేకుండా, ప్రణాళిక బద్ధంగా పని చేయాలన్న దిశగా విద్యుత్, నీటి వసతులు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మీడియా ఏర్పాట్లు, వసతి సదుపాయాలు వంటి అన్ని విభాగాలు పరస్పరం సమన్వయంతో వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పర్యటన విజయవంతం కావాలంటే ప్రతి శాఖ సమిష్టిగా పనిచేయాలని, అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ ప్రతిష్ఠకు తగ్గట్టుగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా పరిపాలన పూర్తిస్థాయి సమన్వయంతో పని చేసి, సకాలంలో అన్ని పనులు పూర్తి చేయాలని, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డిపిఓ అనూష, పంచాయతీరాజ్  ఈ ఈ శ్రీనివాస్, ఎంపీడీవోలు  కళాశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

పట్నంలో పాలమూరు బిడ్డలు సంఘం సభ్యత్వ నమోదు పోస్టర్ ఆవిష్కరణ పట్నంలో పాలమూరు బిడ్డలు సంఘం సభ్యత్వ నమోదు పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్: హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతంలో నివసిస్తున్న పాలమూరు వలస కార్మికులు, ఉద్యోగులకు పూర్తి అండగా నిలవాలని ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు....
నాడు పాడుబడ్డ భవనం …నేడు రోజుకి 3 పెద్దాపెరేషన్ చేసే పేదల ఆసుపత్రి
ఇప్పటికే కేటీఆర్ ఒక లక్ష సార్లు చెప్పిండు
సీఎం పర్యటనకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మార్గదర్శకంలో విపత్తు ప్రణాళిక హ్యాండ్‌బుక్ రూపకల్పనకు ఇండియా హౌస్ బృందం విస్తృత పర్యటన
కలెక్టర్ జితేశ్ వి పాటేల్ ను సత్కరించిన జిల్లా న్యాయవాదులు ::    కొత్తగూడెం లీగల్::        *కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కు జాతీయ అవార్డు.! 
నేడే  సింగరేణిలో డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం

Advertise