కలెక్టర్ జితేశ్ వి పాటేల్ ను సత్కరించిన జిల్లా న్యాయవాదులు :: కొత్తగూడెం లీగల్:: *కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కు జాతీయ అవార్డు.!
రాష్ట్రపతి చేతుల మీదగా ' జన్ భాగీదారి' అవార్డు అందుకున్నారు:
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 21_) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జతేష్ వి పాటిల్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికై జిల్లాకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చారు. జిల్లాలో ' జల్ సంజయ్ ' జన్ భాగి దారి 'కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు గాను ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదగా ఈ అవార్డు
ఢిల్లీలో గౌరవార్థంగా అందుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ చేతుల మీదుగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు విభాగం. సౌత్ జోన్ నగదు బహుమతి. రూ .25 లక్షలు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఈ అవార్డుకు ఆరు జిల్లాలను ఎంపిక చేయగా, వాటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చోటు దక్కించుకోవడం విశేషం. జల సంరక్షణలో ప్రజల భాగ్యస్వామ్యాన్ని పెంచే దిశగా కలెక్టర్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ జాతీయ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, సత్తుపల్లి మరియు మణుగూరు న్యాయవాదులు అందరూ కలిసి కలెక్టర్ గారికి గౌరవార్థంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జనపరెడ్డి గోపికృష్ణ, సీనియర్ న్యాయవాదులు గణేష్ బాబు, రేపక వెంకటరత్నం, రమేష్ కుమార్ మక్కడ్, పలీవేల సాంబశివరావు, జియా ఉల్ హుసేన్, ఎర్రపాటి కృష్ణ, నంబూరి రామకృష్ణ, షామీర్ శరత్ ,రవి తేజ మహిళా న్యాయవాదులు జి.శాంత, అన్నపూర్ణ, ఆర్తి మక్కడ్ తదితరులు న్యాయవాదులు పాల్గొన్నారు.
