సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..

On
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..

 

ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి 10వేల విలువ గల క్వింటా బియ్యం నిత్యాసర వస్తువుల అందజేత 


నమస్తే భారత్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)


సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పీకే ఓసి 2 లో ఈపి ఆపరేటర్ గా పనిచేస్తున్న  మడ్డి రాము దివ్య దంపతులకు కుమార్తె జోషిక జన్మదిన వేడుకలు అశ్వాపురం ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు. తన పుట్టినరోజు వేడుకలు సందర్భంగా వృద్ధులకు సహాయం చేయాలనే తమ కుమార్తె జోషిక అభ్యర్థన మేరకు తల్లిదండ్రులు పదివేల రూపాయలు విలువగల  క్వింటా బియ్యం నిత్యాసర వస్తువులు వృద్ధాశ్రమానికి అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. చిన్నారికి అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ... వృద్ధాశ్రమం నిర్వహణ అనేది వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని దాతల సహకారంతో విజయవంతంగా నడిపిస్తున్న షేక్ షహనాజ్ మేహరాజ్ దంపతులను ఆయన అభినందించారు. వేసవి నేపథ్యంలో వృద్ధులు తగు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగి షేక్ గఫూర్, బంధు వులు ఎం సత్యం, సాంబ లక్ష్మి, వృద్ధాశ్రమం నిర్వాహకులు షేక్ షహనాజ్, మేహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

Share On Social Media

Related Posts

Latest News

 పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే... పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్యాస్‌ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అందులోబాటులో ఉన్న పైప్‌ గ్యాస్‌ విధానానికి మారాలని వినియోగదారులకు సూచించింది. (Use...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా
వరంగల్ కలెక్టరేట్ వద్ధ ఆశా వర్కర్ల ధర్నా

Advertise