త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?

On
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో ఇప్పటికే ఇండియాలో చమురు సంక్షోభం మొదలైంది. త్వరలో ఎరువుల కొరత వేధించే అవకాశం ఉంది. మరోవైపు ఔషధాల ధరలు కూడా పెరగొచ్చు. ఈ నేపథ్యంలో ఇండియన్స్‌కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇండియాలో త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా విదేశీ బ్రాండ్లు తమ బీర్ల ధరల్ని పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ యుద్ధం కారణంగా రవాణా స్తంభించిపోవడమే దీనికి ప్రధాన కారణం. బీర్ల తయారీలో వాడే గ్లాస్ బాటిల్స్, అల్యూమినియం క్యాన్ల తయారీకి అవసరమైన ముడిసరుకు విదేశాల నుంచే వస్తుంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా రవాణా నిలిచిపోయి, వీటి దిగుమతులు ఆగిపోయాయి. దీంతో బీర్ల తయారీ కంపెనీలపై అదనపు భారం పడుతోంది. మరోవైపు చమురు ధరలు పెరగడం కూడా బీర్ల తయారీపై ప్రభావం చూపుతోంది. ప్రపంచంలో నాలుగోవంతు నేచురల్ గ్యాస్‌ను ఇండియా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అది కూడా ఎక్కువగా పశ్చిమాసియా నుంచే వస్తుంది. అందులోనూ ఖతార్ నుంచే 40 శాతం చమురు దిగుమతి అవుతుంటుంది. కానీ, ఇప్పుడు గ్యాస్ సరఫరా లేక చమురు ధరలు పెరగడం, బాటిల్స్ సరఫరా నిలిచిపోవడంతో బీర్ల తయారీ కంపెనీలపై అదనపు భారం పడుతోంది. ఈ కారణంగా గ్లాస్ బాటిల్ ధరలు 20 శాతం పెరిగాయి. అలాగే, బీర్లను ఉంచే పేపర్ కార్టన్ రేట్లు కూడా రెట్టింపైనట్లు తయారీ కంపెనీలు చెబుతున్నాయి.

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise