భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

On
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత

 

 

కేశంపేటలో శ్రీ సీత రామాంజనేయ దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

నమస్తే భారత్  షాద్ నగర్ మార్చ్25:కేశంపేట మండలకేంద్రంలోని శ్రీ సీత రామాంజనేయ దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది. ఈ శుభకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా సామాజిక ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని తెలిపారు. దేవాలయ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ పీఎసీఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, స్థానిక సర్పంచ్ శ్రీశైలం, మాజీ సర్పంచులు వెంకట్ రెడ్డి, యాదగిరి రావు, నవీన్ కుమార్, మాజీ ఎంపీటీసీ మల్లేష్ యాదవ్, నాయకులు జమాల్ ఖాన్, దర్శన్, జగన్ రెడ్డి, రామకృష్ణ, ప్రవీణ్ రెడ్డి, బైకని శేఖర్, నరేష్ యాదవ్, శ్రీను, వెంకటేష్, రాము, జగన్ తదితరులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Share On Social Media

Related Posts

Latest News

 పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే... పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్యాస్‌ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అందులోబాటులో ఉన్న పైప్‌ గ్యాస్‌ విధానానికి మారాలని వినియోగదారులకు సూచించింది. (Use...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా
వరంగల్ కలెక్టరేట్ వద్ధ ఆశా వర్కర్ల ధర్నా

Advertise