శక్తిని ఇచ్చే సహజ తీపి బెల్లం చాయ్  

On
శక్తిని ఇచ్చే సహజ తీపి బెల్లం చాయ్  

 

మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ 

హేమాద్రి రెస్టారెంట్, బెల్లం చాయ్ లను ప్రారంభించిన అంజయ్య యాదవ్

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్27:హోటల్స్, రెస్టారెంట్స్, టీ స్టాల్స్  రుచికి, నాణ్యతకు ప్రమాణికంగా ఉండాలని, మనం తినే ఆహారం ఆరోగ్యాన్ని ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అభిప్రాయపడ్డారు. గురువారం షాద్ నగర్ పట్టణంలోని  మహబూబ్ నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన  హేమాద్రి రెస్టారెంట్, ఆర్గానిక్ బెల్లం చాయ్ హోటల్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఆర్గానిక్ బెల్లంతో  తయారుచేసే టీ ని సేవిస్తే కొంతమేర ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. ఇటీవల కాలంలో పలు హోటల్స్ లో  నాసిరకం వంటకాలను వడ్డిస్తున్నారని, ఇతర సంస్కృతి మంచిది కాదని చెప్పారు. పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, ఆ దిశగా హోటల్ నిర్వాకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. స్వయం ఉపాధిలో భాగంగా హేమాద్రి రెస్టారెంట్ ను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకుల పనితీరును కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ వైస్ చైర్మన్ నటరాజ్, మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీశైలం నాయకులు సత్యం యాదవ్, ఆనంద్, భువనేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise