కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
కోర్టు లో రాజ్యాంగ పీఠికను చదివిన కోర్టు న్యాయమూర్తులు, కోర్ట్ సిబ్బంది
కోర్టు సిబ్బందిచే రాజ్యాంగ పీఠికను చదివించిన 16వ అదనపు జిల్లా జడ్జి స్వాతి రెడ్డి
కార్యక్రమం లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కొత్త రవి
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్26:భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు కోర్టు ప్రాంగణంలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 16వ అదనపు జిల్లా జడ్జ్ మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్.స్వాతి రెడ్డి భారత రాజ్యాంగంలోని పీఠిక
*భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగ నిర్మించుకోవడానికి పౌరులందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలలో స్వేచ్ఛను అంతస్తు (హోదా) లోను, అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాత్యైక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగ తీర్మానించుకొని 26 నవంబర్ 1949న మన రాజ్యాంగపరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకొన్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అని చదువుతూ కోర్టు సిబ్బందిచే చదివించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కొత్త రవి మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
