గ్రామ సేవలో నిలిచిన మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ లకి ఘన సన్మానం…
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్28:లక్ష్మీదేవుని పల్లి గ్రామంలో విశిష్టమైన సేవలందించిన మాజీ సర్పంచ్ నర్సింలు గారిని, ఉప సర్పంచ్ రాజేష్ గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధి కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెనుకడుగు వేయని నాయకులుగా వారు గుర్తింపు పొందారు.సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో గ్రామానికి నీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ సహాయం ఆలస్యమవుతుందని గ్రహించి తన సొంత బోర్ నుండి పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసి గ్రామస్తులకు తాగునీరు అందించటం నర్సింలు గారి అత్యంత గొప్ప సేవగా నిలిచింది.ఎవరైనా విమర్శించినా, తిట్టినా పట్టించుకోకుండా “గ్రామానికి సేవే ముఖ్యం” అనే ధ్యేయంతో ముందుకు సాగారు.గ్రామంలో రహదారులు, శానిటేషన్, వీధి లైట్లు తదితరాల అభివృద్ధికి కూడా వారు వ్యక్తిగతంగా శ్రమించడంతో పాటు, ప్రభుత్వ పథకాలను సమర్థంగా తీసుకొచ్చి ప్రజలకు ప్రయోజనం చేకూర్చారు.ఈ సేవల గుర్తింపుగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువత, పాల్గొన్నారు. గ్రామస్థులు ఆయన నాయకత్వం, నిజాయితీ, సేవాభావాన్ని ప్రశంసించారు.
