నేటితో జూబ్లీహిల్స్‌లో ప్రచారానికి తెర..

On
నేటితో జూబ్లీహిల్స్‌లో ప్రచారానికి తెర..

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక (n) ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియనుంది. సాయంత్రం 5 తర్వాత మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి, ఆంక్షలు మొదలు కానున్నాయి. నవంబర్ 11న పోలింగ్‌ జరగనుండగా 14న ఫలితం వెలువడనుంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అకాల మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య మాగంటి సునీత కారు గుర్తుపై పోటీచేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి నవీన్‌ యాదవ్‌, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వీరితోపాటు మరో 55 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవితవ్యాన్ని 4,01,365 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఉపఎన్నిక కోసం 407 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 226 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 139 డ్రోన్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 తర్వాత 144 సెక్షన్ అమల్లోకి రానుంది.పోలింగ్‌ సమయం గంట పెంపజూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ శాతాన్ని పెంచే దిశగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉన్న పోలింగ్‌ సమయాన్ని తొలిసారిగా మరో గంట పాటు పొడిగించారు. 11న పోలింగ్‌ ఏడు గంటల నుంచి ప్రారంభమై ఆరు గంటల వరకు కొనసాగనున్నది. సాయంత్రం ఆరు గంటల కల్లా పోలింగ్‌ స్టేషన్‌ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక ఓటరూ ఓటును వినియోగించుకోనున్నారు. క్యూ లో ఎంత మంది ఉన్నా, ఎంత సమయం పట్టినా, అందరూ ఓట్లు వేసిన తర్వాతే పోలింగ్‌ ప్రక్రియ ముగించి, ఈవీఎంలను ఏజెంట్ల సమక్షంలో సీజ్‌ చేసి, రిసెప్షన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌కు తరలించనున్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise