ఆలోచనలో.. ఆచరణలో.. మా ఇద్దరిదీ ఒకే దారి!: మాగంటి సునీత

On
ఆలోచనలో.. ఆచరణలో.. మా ఇద్దరిదీ ఒకే దారి!: మాగంటి సునీత

మా ప్రాంతంలో ఆడవాళ్లంతా మావారిని ‘గోపన్నా… గోపన్నా’ అని ప్రేమగా పిలుస్తారు. ప్రజాభిమానాన్ని చూరగొనడం గొప్పే అయినా మహిళా ఓటర్ల మెప్పు పొందడం అన్నది చాలా పెద్ద విషయం. దీనికి కారణం మహిళల పట్ల ఆయన చూపే ప్రత్యేక ఆదరణే. కష్టం అని ఏ ఆడపిల్ల తన దగ్గరికి సాయం కోసం వచ్చినా ఖాళీ చేతులతో పంపిన దాఖలాలు నాకు తెలియదు. మహిళల్ని అంత గొప్పగా చూసే మనిషికి భార్యను కావడం నేను అదృష్టంగా భావిస్తాను. నా విషయంలోనూ ఆయనెప్పుడూ ఎంతో ప్రేమ, ఆదరణ చూపించేవారు. కుటుంబ బాధ్యతల్లో నాకే స్వతంత్రం ఇచ్చేవారు. అయితే ఇంటితో పోలిస్తే ఆయనకు నియోజకవర్గమే తొలి ప్రాధాన్యంగా ఉండేది. ఒక ప్రజానేత భార్యగా ఆయన ఆలోచనల్నీ, అక్కడి అవసరాల్నీ నేనూ అర్థం చేసుకునేదాన్ని. కాబట్టి ఆ విషయంలో ఇద్దరిదీ ఒకేదారి అయింది 

Tags

Share On Social Media

Latest News

Advertise