మల్లన్న సాగర్ నీ తాత కట్టిండా..? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్..!
మల్లన్న సాగర్ ఎవరు కట్టారు.. నీ తాత కట్టిండా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల వద్ద పేల్చిన చెక్ డ్యామ్‌ను గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, దాసరి మనోహర్ రెడ్డి, రసమయి బాలకిషన్, నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్‌ను కూల్చివేసింది కాంగ్రెస్ నేతలేనన్నారు. కాంగ్రెస్ హయంలో చెరువులు, చెక్ డ్యామ్‌ల పేల్చివేత నిత్య చర్యగా మారిందన్నారు. గతంలో పెద్దపల్లి భోజన్న పేట వద్ద హుస్సేన్ మియావాగుపై కూడా చెక్ డ్యామ్ పేల్చివేశారని ఆరోపించారు. గుంపుల వద్ద చెక్ డ్యామ్ కూడా కులలేదని.. పేల్చారని ఇక్కడి రైతులే చెప్తున్నారన్నారు. ఇసుక మాఫియానే కూల్చివేసిందని, కాంగ్రెస్ పాలనలో వేల కొద్ది లారీల్లో ఇసుక తరలిస్తున్నారన్నారు. రాత్రికి రాత్రి చెక్ డ్యామ్ పేల్చేశారని.. భోజన్నపేటలో హుస్సేన్ మియావాగుపై చెక్ డ్యామ్ పేల్చివేస్తుంటే రైతులే పట్టుకున్నారన్నారు.అప్పుడు రైతులే కేసులు పెట్టారని.. పోలీసులు ఇప్పటివరకు దోషులను పట్టుకోలేదని ఆరోపించారు. తాజాగా మరో చెక్ డ్యామ్ పేల్చారని.. అప్పుడే పోలీసులు దోషులను శిక్షిస్తే.. ఈ రోజు గుంపుల చెక్ డ్యామ్‌కు ఈ పరిస్థితి రాకుండేదన్నారు. ఈరోజు వరకు పోలీసులు వాళ్లను పట్టుకోలేదని.. మూడు రోజులు అయిన ఇక్కడి పేల్చవేత దోషులను పోలీసులు పట్టుకోలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లను కాపాడుతుందని.. ఆనాడు గుండాలను అరెస్ట్ చేస్తే ఈ రోజు ఇక్కడి చెక్ డ్యామ్ పేల్చకపోయేవాళ్లని.. హైదరాబాద్‌లో ఇండ్లు, ఇక్కడ చెరువులు, చెక్ డ్యామ్‌లు కూలగొడుతున్నారన్నారు. కేసీఆర్ కట్టుడు.. కాంగ్రెసోళ్ల కూలగొట్టూడని.. మానేరు నది మీద చెక్ డ్యామ్‌లు కట్టి సస్యశ్యామలం చేశామన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌కు చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కట్టిందని.. చర్యలు తీసుకోవాలంటే పొంగులేటిపై తీసుకోవాలన్నారు. రాఘవ కంపెనీని బ్లాక్ చేయాలన్నారు. పొంగులేటి నుంచి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 6 లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తామని ఉత్తమ్ కుమార్ చెప్పిండని.. ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు
