శంషాబాద్ పురపాలికలో ఘనంగా అయ్యప్ప పడిపూజ
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
నమస్తే భారత్ , రాజేంద్రనగర్, నవంబర్ 19, పురపాలక పరిధిలోని అయ్యప్ప దేవాలయంలో పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో బుధవారం అయ్యప్ప స్వాములు పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అభిషేక ప్రియుడైన వహరుడు అలంకార ప్రియుడైన హరిసతుడు మణికంఠుని సేవలో పట్టణవాసులు పులకించారు. పడిపూజ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప స్వాములు భక్తులతో ఆ ప్రాంగణం కిటకిటలాడింది. మణికంఠుడి మంగళకర పూజలు శాస్త్రక్తంగా జరిగాయి, అరటి బోదెలు వివిధ రకాల పూల అలంకరణలతో దేవతామూర్తులు కొలువుతీరిన అయ్యప్ప పడి పూజ శోభయ మానంగా తీర్చిదిద్దారు. ప్రారంభంలో విజ్ఞాధిపతి విజ్ఞేశ్వరుడు చివరన సిరులు గొలిచే మహాలక్ష్మి అమ్మవార్ల మధ్య హరిహరసుతుడు కొలువు తీరాడు. ఎయిర్పోర్టులో ప్రైవేటు ఉద్యోగి గుర్రాల ప్రభాకర్ రెడ్డి సరళ దంపతుల ఇద్దరు కుమారులు కన్నెస్వాములు కార్తీక్ రెడ్డి వీరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యాసాగర్ గురు స్వామి అర్చకత్వం వహించారు. మొదటినుంచి చివరి వరకు సాగిన పడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. బత్తుల ఆలపించిన అయ్యప్ప గీతాలు ఆధ్యాత్మిక చింతనం కలిగించాయి. అయ్యప్ప పడిపూజకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
