రామభక్తుల సంకల్పం సిద్ధించింది: ప్రధాని మోదీ

On
రామభక్తుల సంకల్పం సిద్ధించింది: ప్రధాని మోదీ

లక్నో, నవంబర్ 25: భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షిగా అయోధ్య నిలిచిందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం బాలరాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. జై శ్రీరామ్ నినాదంతో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందన్నారు. రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు పూర్ణాహుతి జరిగిందని చెప్పారు.ర్మ ధ్వజం కేవలం జెండా కాదని..భారత సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమని ప్రధాని మోదీ అభివర్ణించారు. సంకల్పం, సఫలతకు ఈ ధ్వజం చిహ్నమని పేర్కొన్నారు. ధర్మ ధ్వజం శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందన్నారు. ధర్మ ధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణ ఇస్తుందని స్పష్టం చేశారు. కర్మ,కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మ ధ్వజం వివరిస్తుందన్నారు. పేదలు,దుఃఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ధ్వజారోహణ కార్యకమ్రంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయన్నారు. ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగారో అయోధ్య చెబుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise