జీహెచ్‌ఎంసీ విస్తరణకు ఆమోదం.. ఆ మున్సిపాలిటీలన్నీ విలీనం

On
 జీహెచ్‌ఎంసీ విస్తరణకు ఆమోదం.. ఆ మున్సిపాలిటీలన్నీ విలీనం

 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ (GHMC) విస్తరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్‌ను (ORR) ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.పెద్ద అంబర్ పేట్, జల్‌పల్లి, తుర్కయంజాల్, శంషాబాద్‌లు, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, దమ్మాయి గూడ, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, బడంగ్‌‌పేట్, బండ్లగూడ జీగీర్, మీర్‌పేట్, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనం కాబోతున్నాయి. మరోవైపు మూడో డిస్కం ఏర్పాటుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్స్‌ కొత్త డిస్కం పరిధిలోకి రానున్నాయి. అదేవిధంగా 3 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కొనుగోలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Tags

Share On Social Media

Latest News

Advertise