మణికొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు 

On
మణికొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు 

 

 ట్యాంక్ బండ్ పీపుల్ ప్లాజాలో విద్యార్థులకు అవగాహన 

 పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ రెడ్డి

 నమస్తే భరత్, రాజేంద్రనగర్, నవంబర్ 14, బాలల దినోత్సవ సందర్భంగా మణికొండ లోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో నవంబర్ 14 బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలో శుక్రవారం కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నెహ్రూ జయంతి సందర్భంగా జరుపుకునే బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు. సందర్భంగా ట్యాంక్ బండ్ లోని పీపుల్ ప్లాజా లో జరిగిన ముక్తిభారత్ మార్చిలో పాల్గొనడానికి తమ పాఠశాల పిల్లలకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ రెండు టూరిస్ట్ బస్సులలో తీసుకెళ్లి విద్యార్థులకు హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పించారని ఇది మాకెంతో గర్వకారణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ కృష్ణవేణి టాలెంట్ పాఠశాల ఉపాధ్యాయ బృందం తిరుపతిరెడ్డి, రవీందర్, శశికళ, అనిత శ్రీ, అంజి, బాలకృష్ణ, నిఖిలేంద్ర, బాలాజీ, రాంబాబు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise