Tag
BRS
రంగారెడ్డి 

ప్రభుత్వం అరెస్టులు - ప్రశ్నించడమే నేరమా

ప్రభుత్వం అరెస్టులు - ప్రశ్నించడమే నేరమా ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా ఈ ప్రభుత్వం అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం అని బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు చిన్నగండు రాజేందర్ హనుమంతు ముదిరాజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో బస్ భవన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న కార్యకర్తలను ముందస్తుగానే హౌజ్ రెస్టు లు చేయడం ఎంతవరకు సమంజసం అని పార్టీ సీనియర్ నాయకులు రాజేందర్ అన్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము లేక నిరంకుషత్వమా మహిళలకు ఫ్రీ బస్సులు అంటూ గొప్పలు చెప్పుకుంటూ బస్సు చార్జీలు పెంచడం దారుణం అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అన్యాయంపై మాట్లాడితే అరెస్టులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. బస్ చార్జీలను విపరీతంగా పెంచి ప్రయాణికుల పై ఈ ప్రభుత్వం శఠ గోపం పెడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చి హామీలు అమలు చేయలేక హామీలపై అడిగితే ఈ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆర్గారంటీల పథకాలను వెంటనే అమలు చేయాలన్నారు.
Read More...
రంగారెడ్డి 

ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ

 ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ 4000 పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు కూలీలకు 12,000, రైతు భరోసా నిధులు, కల్యాణ లక్ష్మి తులం బంగారం, సిలిండర్లకు 500 సబ్సిడీ వంటి పథకాలు అమలుకోవడం లేదని అంజయ్య యాదవ్ ముందు గోడు వెళ్ళబోసుకున్న బాదిత ప్రజలు కేసీఆర్ అన్ని పథకాలను అందిస్తే రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని బహిరంగంగా హెచ్చరించిన మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి బాకీ పడిందని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా షాద్ నగర్ మున్సిపాలిటీ ఫరూఖ్ నగర్ లో స్వయంగా ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అనే విషయాలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్న అనంతరం మాట్లాడారు. వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోయిందని విమర్శించారు. ఉచిత బస్సు మినహా ఏ పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారని, పేద ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నారని  చెప్పారు. సాధారణ కుటుంబానికి సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వేల రూపాయలు బాకీ పడిందని, కాంగ్రెస్ చేతిలో మోసపోయామని పేద ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఇందులో భాగంగానే 4000 పింఛన్లు, రాయితీ సిలిండర్లు, గృహా జ్యోతి విద్యుత్తు, రైతు కూలీలకు 12,000, మహిళలకు 2500, విద్యార్థులు విద్యార్థినీలకు స్కూటీలు, రైతు భరోసా నిధులు, రైతు రుణమాఫీ, బతుకమ్మ చీరల పంపిణీ వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం లేదని ప్రజలు బహిరంగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పారు.
Read More...
హైదరాబాద్ 

కేపీహెచ్‌బీలో బీఆర్‌ఎస్‌వీ నాయకుడు హల్ చల్.!

కేపీహెచ్‌బీలో బీఆర్‌ఎస్‌వీ నాయకుడు హల్ చల్.! ప్రశ్నించిన యువకుడిని హాస్టల్‌లోనికి వెళ్లి దాడి హాస్టల్‌ కిటికీలు తలుపులు పగలగొట్టిన అన్నవరం అండ్‌ గ్యాంగ్‌ దాడికి పాలుపడిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూకట్ పల్లి: కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో దౌర్జన్యానికి పాల్పడిన దుర్గాప్రసాద్‌ అలియాస్‌ అన్నవరంతో పాటు అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు నంబర్ 3లోని శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్‌పై అర్థరాత్రి జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం, కేపీహెచ్‌బీ డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ అలియాస్‌ అన్నవరం తన గ్యాంగ్‌తో కలిసి మద్యం మత్తులో హాస్టల్‌ సమీపంలో వెళ్తున్న ఒక యువతిని వేధించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వెంకటేష్‌ అనే యువకుడు వారిని అడ్డుకుని, ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించాడు. ఈ మాటలకు ఆగ్రహించిన గ్యాంగ్‌, వెంకటేష్‌పై దాడికి దిగింది.ప్రాణభయంతో వెంకటేష్‌ సమీపంలోని శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్‌లోకి పారిపోయాడు. అయితే, అన్నవరం అండ్‌ గ్యాంగ్‌ అతడిని వదలకుండా హాస్టల్‌లోకి దూసుకెళ్లారు. కర్రలతో హాస్టల్‌ కిటికీలు, తలుపులను ధ్వంసం చేసి, ఆ తర్వాత వెంకటేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ అనూహ్య ఘటనతో హాస్టల్‌లోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగు తీశారు. రాత్రి చదువుకుంటుండగా ఒక్కసారిగా కిటికీలు పగులగొడుతున్న శబ్దం వినిపించింది. గ్యాంగ్‌ లోపలికి వచ్చి అల్లరి చేయడంతో  ఒక్కసారిగా భయానికి గురయ్యామని హాస్టల్‌ విద్యార్థులు భయంతో చెప్పారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దుర్గాప్రసాద్‌ అలియాస్‌ అన్నవరం, అతని అనుచరులపై దాడి, ఆస్తి ధ్వంసం, హౌస్‌ట్రెస్పాస్‌, అసభ్యకర వ్యాఖ్యల వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకోగా.. మరి కొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక దాడి మాత్రమే కాదని, యువతులపై వేధింపులకు ఇదొక సంకేతమని, పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
Read More...

Advertisement