2015 గ్రూప్‌-2 ర్యాంకర్స్‌కు ఊరట.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్‌ చేసిన సీజే ధర్మాసనం

On
2015 గ్రూప్‌-2 ర్యాంకర్స్‌కు ఊరట.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్‌ చేసిన సీజే ధర్మాసనం

2015 గ్రూప్‌-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం ఊరటనిచ్చింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, 2015-16లో నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షను ఇటీవల న్యాయమూర్తి నగేష్‌ భీమపాక నేతృత్వంలోని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల సమయంలో హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని పేర్కొంది. టీజీపీఎస్‌సీ పరిధి దాటి వ్యవహరించిందని న్యాయమూర్తి.. తిరిగి మూల్యాంకనం చేయాలని బోర్డును ఆదేశించారు. ఆ తర్వాత మళ్లీ అర్హుల జాబితాను ప్రకటించాలని చెప్పారు. ఎనిమిది వారాల్లోగా పునః మూల్యాంకరనం జరుగాలని.. జాబితా ప్రకటన ప్రక్రియ ముగించాలని సూచించారు. అయితే, సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ పలువురు సీజే ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న సీజే ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఆదేశాలను పక్కన పెట్టింది. 

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise