స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రారంభించి..

On
స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రారంభించి..

హైదరాబాద్‌ రావిల్యాలలోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్‌ విక్రమ్‌-1ను ఆవిష్కరించారు. స్కైరూట్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ సంస్థ కావడం విశేషం. ఈ సందర్భంగా స్కైరూట్‌ బృందానికి ప్రధాని అభినందనలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ అంతరిక్షంలో ఇది మైలురాయిగా పేర్కొన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్‌ గొప్ప ప్రతీక అని, భారత అంతరిక్ష రంగం భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుందని.. సైకిల్‌పై రాకెట్‌ మోసుకెళ్లే స్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైందన్నారు. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలని పిలుపునిచ్చారు. స్పేస్‌ సెక్టార్‌లో కో ఆపరేటివ్‌, ఎకో సిస్టమ్‌ను తీసుకువచ్చామని.. జన్‌జీ అనుకున్నది సాధించేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. 

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise