లేబర్ కోడులను వెంటనే ఉపసంహరించుకోవాలి
ఏఐఎఫ్టియు (న్యూ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోడేమ్ మల్లేశం
నర్సంపేట నవంబర్ 26 ( నమస్తే భారత్ ) :
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడుల అమలును వెంటనే ఉపసంహరించుకోవాలని, ఏఐఎఫ్టియు న్యూ ఆధ్వర్యంలో నర్సంపేటలోని అమరవీరుల స్తూపం ముందు అమలు జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. దుగ్గొండి మండలం నల్లబెల్లి ఖానాపురం నర్సంపేట రాజుపేట ఏరియా మహేశ్వరి ఏరియా వరంగల్ జిల్లా సెంటర్ తదితర ఏరియాలలో ఏఐఎఫ్టీయూ న్యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఈ కార్యక్రమం ను ఉద్దేశించి ఏఐఎఫ్టియు (న్యూ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోడేమ్ మల్లేశం మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి, మోడీ సర్కార్ కరోనాకాలం 2021 లోనే కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడులను, ఆగ మేఘాల మీద తీసుకురావడం జరిగిందన్నారు. ఆనాటి నుండి నేటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడులను రద్దు చేయాలని, కార్మిక వర్గం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్న , కార్మిక వర్గం యొక్క విన్నపాన్ని మన్నించకుండా, మొన్న జరిగిన బీహార్ ఎన్నికల ఫలితాల వెంటనే తాము తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడులను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి జీవోను తీసుకురావడం జరిగిందన్నారు.
ఈ నాలుగు లేబర్ కోడుల ఫలితంగా కార్మికులు అనేక సంవత్సరాలుగా, అనేకమంది కార్మికుల త్యాగాల ఫలితముగా, పోరాడి సాధించుకున్న హక్కులు మొత్తం హరించబడతాయని తెలిపారు. సంఘం పెట్టుకునే హక్కు గాని వేతనాల పెంపు కోసం సమ్మె చేసుకునే హక్కు గాని, ప్రమాదాలు జరిగితే నష్టపరిహారాలు పొందే హక్కు గాని, ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచటం. కార్మిక హక్కులను రద్దుచేసి యాజమాన్యం వేసే ఎంగిలి మెతుకులపై ఆధారపడాల్సిన పరిస్థితిని కార్మిక వర్గానికి మోడీ సర్కార్ తీసుకువచ్చిందన్నారు.
ప్రధానంగా మోడీ సర్కార్ సామ్రాజ్యవాదా, బహుళ జాతి కంపెనీల, బడా పెట్టుబడిదారులకు భారతదేశ కార్మిక వర్గ శ్రమను కారు చౌకగా కట్టబెట్టడానికె ఈ లేబర్ కోడులను తీసుకువచ్చింది. కానీ కార్మిక వర్గానికి, వారి జీవితాలకు ఈ లేబర్ కోడులు వెలుగునిస్తాయని, వారి జీవితాలను మెరుగుపరుస్తాయని తప్పుడు ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనను తాము తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడుల అమలును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిచో కార్మిక వర్గం సంగటితంగా ఐక్యంగా నిలబడి తమ హక్కులను తాము కాపాడుకుంటారని తెలియ పరచటము జరిగినది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్ భూమా అశోక్, శివరాత్రి కుమారస్వామి, ఏఐఎఫ్టియు (న్యూ) రాష్ట్ర నాయకులు రుద్రారపూ ఎల్లన్న, బైరబోయిన ఐలయ్య,జిల్లా నాయకులు రొట్టె శ్రీనివాస్, పోషాలు, మంద మల్లయ్య, మెరుగు జనార్ధన్, బొల్లివేన రమేష్, రాజేందర్, రాజు, యాకన్న, శ్రీనివాస్, సదానందం ఏకాంబరం, ఐలయ్య, రవి, చిరంజీవి, ప్రశాంత్ ,లక్ష్మణ్ బాబు, సదానందం, రాజు, రవి, చంద్రమౌళి, లింగన్న,ఇప్ప బాబు సదానందం, రాజు కుమారస్వామి, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
