Tag
hydra ranganath latest
Telangana 

ముంపు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం

ముంపు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దోమ‌ల‌గూడ‌, బాగ్‌లింగంప‌ల్లిలో ప‌ర్య‌టించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఆశోక్‌న‌గ‌ర్‌లో వ‌ర‌ద కాలువ విస్త‌ర‌ణ‌కు క‌మిష‌న‌ర్ ఆదేశం నగ‌రంలో నీట మునిగిన లోత‌ట్టు ప్రాంతాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ శుక్ర‌వారం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. బాగ్‌లింగంప‌ల్లిలోని శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీతో పాటు.. దోమ‌ల‌గూడ‌లోని గ‌గ‌న్‌మ‌హ‌ల్‌, అశోక్‌న‌గ‌ర్ ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. వారం రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో త‌మ ప్రాంతాలు నీట మునుగుతున్నాయ‌ని స్థానికులు క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. వ‌ర్షం ప‌డితే వ‌ణికిపోవాల్సి వ‌స్తోంద‌ని, బాగ్‌లింగంప‌ల్లిలోని శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీ వాసులు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ముందు వాపోయారు. లోత‌ట్టు ప్రాంతంలో ఉన్న త‌మ కాల‌నీలో పెద్ద‌మొత్తంలో వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంద‌ని అన్నారు. గ‌తంలో ఇక్క‌డ ఉన్న ఖాళీస్థ‌లంలోంచి హుస్సేన్‌సాగ‌ర్ నాలాలోకి వ‌ర‌ద నీరు చేరేద‌ని.. అక్క‌డ పైపులైను దెబ్బ‌తిన‌డంతో స‌మ‌స్య త‌లెత్తుతోంద‌ని చెప్పారు. 450 ఇళ్లు వ‌ర‌ద నీటిలో మునుగుతున్నాయ‌ని స్థానికులు వాపోయారు. గురువారం, శుక్ర‌వారం వ‌రుస‌గా హైడ్రా క‌మిష‌న‌ర్ వ‌చ్చి స‌మ‌స్య తీవ్ర‌త‌ను ప‌రిశీలించ‌డం, ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ప‌ట్ల స్థానికులు సంతోషం వ్య‌క్తం చేశారు. 
Read More...
Telangana  TS జిల్లాలు  

కోట్ల విలువ చేసే పార్కుల‌ను కాపాడిన హైడ్రా

కోట్ల విలువ చేసే పార్కుల‌ను కాపాడిన హైడ్రా పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను హైడ్రా బుధ‌వారం కాపాడింది. దాదాపు 1600 గ‌జాల వ‌ర‌కూ ఉన్న ఈ భూమి విలువ రూ. 16 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా బాలాన‌గ‌ర్ మండ‌లం, మూసాపేట స‌ర్కిల్ ప‌రిధిలోని స‌న‌త్‌న‌గ‌ర్ కోప‌రేటివ్ సొసైటీకి చెందిన లే ఔట్లో వెయ్యి గ‌జాల పార్కు స్థ‌లాన్ని కాపాడింది. 1967లో 172 ప్లాట్ల‌తో ఈ లే ఔట్‌ను వేశారు. ఇందులో 1200 గ‌జాల స్థ‌లాన్ని పార్కుల‌కోసం కేటాయించారు. ఈ పార్కు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురౌతున్న‌ట్టు మోతిన‌గ‌ర్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్లు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేర‌కు జీహెచ్ ఎంసీ, డీటీసీపీ, రెవెన్యూ అదికారుల‌తో క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన హైడ్రా.. పార్కు స్థ‌లంగా గుర్తించి వెంట‌నే ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా హెచ్చ‌రిక బోర్డుల‌ను ఏర్పాటు చేసింది. 
Read More...

Advertisement