Tag
KUKATPALLY BRSV
Telangana 

బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు షురూ

బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు షురూ ప్రతి ఏటా కూకట్పల్లిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించటం ఆనావాయితీగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా బతుకమ్మలను ఆడపడుచుల ఆటపాటల నడుమ ఘనంగా పూజించి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయటం అనే వేడుకలు కూకట్పల్లి తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల వారికి కన్నుల పండుగల దర్శనం ఇస్తాయి. ఇట్టి కార్యక్రమం యావత్తు రాష్ట్రంలోనే అమావాస్యకు ఒక్కరోజు ముందుగా 20.09.2025 తారీకున నుండి సాయంత్రం 5 గంటలకు నుండి కూకట్పల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద భారీగా బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ బతుకమ్మ ఆడిన తరువాత రోడ్డు ఆవతలి వైపున పి.ఎన్.యం. స్కూల్ నందు బతుకమ్మ ఆడి రంగాధాముని చెరువులో బతుకమ్మలు నిమజ్జనం చేస్తారు20 తారీకున మొదలుకొని 9 తొమ్మిది రోజులు పాటు ఘనంగా వేడుకలు జరుపుకొని 29.09.2025 సోమవారం సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. సద్దుల బతుకమ్మ సంబరాలు : 29.09.2025 సోమవారం రోజున సద్దుల బతుకమ్మ సంబరాలను కూకట్పల్లి నియోజకవర్గం యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించటం జరుగుతుంది. రంగాధాముని చెరువు (ఐ.డి.ఎల్) కట్ట పై ప్రత్యేక ఏర్పాట్ల నడుమ వేలాది మంది హాజరై బతుకమ్మలను ఘనంగా ఆటపాటలతో పూజించి నిమజ్జనం చేస్తారు. ఆత్యంత వైభవోపేతంగా ఆకట్టుకొనేలా ఆలంకరించిన బతుకమ్మలకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులను కూడ యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు చేతుల మీదగా అందచేయటం జరుగుతుంది. బతుకమ్మ వేడుకలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నాట్య ప్రదర్శనలు వంటి ఆదనపు కార్యక్రమాలతో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బతుకమ్మ వేడుకల ముఖ్య వివరాలు : 1. 20.09.2025 శనివారం బతుకమ్మ ప్రారంభం 2. 21.09.2025 ఆదివారం పెద్దల అమావాస్య 3. 27.09.2025 శనివారం అట్ల బతుకమ్మ 4. 28.09.2025 ఆలిగిన బతుకమ్మ (ఈ రోజు బతుకమ్మ ఉండదు) 5. 29.09.2025 6. 2.10.2025 గురువారం విజయదశమి కూకట్పల్లి రామాలయం దేవాలయంలో సాయంత్రం 5. 30 విజయదశమి వేడకలు
Read More...
హైదరాబాద్ 

కేపీహెచ్‌బీలో బీఆర్‌ఎస్‌వీ నాయకుడు హల్ చల్.!

కేపీహెచ్‌బీలో బీఆర్‌ఎస్‌వీ నాయకుడు హల్ చల్.! ప్రశ్నించిన యువకుడిని హాస్టల్‌లోనికి వెళ్లి దాడి హాస్టల్‌ కిటికీలు తలుపులు పగలగొట్టిన అన్నవరం అండ్‌ గ్యాంగ్‌ దాడికి పాలుపడిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూకట్ పల్లి: కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో దౌర్జన్యానికి పాల్పడిన దుర్గాప్రసాద్‌ అలియాస్‌ అన్నవరంతో పాటు అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు నంబర్ 3లోని శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్‌పై అర్థరాత్రి జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం, కేపీహెచ్‌బీ డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ అలియాస్‌ అన్నవరం తన గ్యాంగ్‌తో కలిసి మద్యం మత్తులో హాస్టల్‌ సమీపంలో వెళ్తున్న ఒక యువతిని వేధించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వెంకటేష్‌ అనే యువకుడు వారిని అడ్డుకుని, ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించాడు. ఈ మాటలకు ఆగ్రహించిన గ్యాంగ్‌, వెంకటేష్‌పై దాడికి దిగింది.ప్రాణభయంతో వెంకటేష్‌ సమీపంలోని శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్‌లోకి పారిపోయాడు. అయితే, అన్నవరం అండ్‌ గ్యాంగ్‌ అతడిని వదలకుండా హాస్టల్‌లోకి దూసుకెళ్లారు. కర్రలతో హాస్టల్‌ కిటికీలు, తలుపులను ధ్వంసం చేసి, ఆ తర్వాత వెంకటేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ అనూహ్య ఘటనతో హాస్టల్‌లోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగు తీశారు. రాత్రి చదువుకుంటుండగా ఒక్కసారిగా కిటికీలు పగులగొడుతున్న శబ్దం వినిపించింది. గ్యాంగ్‌ లోపలికి వచ్చి అల్లరి చేయడంతో  ఒక్కసారిగా భయానికి గురయ్యామని హాస్టల్‌ విద్యార్థులు భయంతో చెప్పారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దుర్గాప్రసాద్‌ అలియాస్‌ అన్నవరం, అతని అనుచరులపై దాడి, ఆస్తి ధ్వంసం, హౌస్‌ట్రెస్పాస్‌, అసభ్యకర వ్యాఖ్యల వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకోగా.. మరి కొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక దాడి మాత్రమే కాదని, యువతులపై వేధింపులకు ఇదొక సంకేతమని, పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
Read More...

Advertisement