ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస పథకాన్ని సివిల్ స్కోర్ తో సంబంధం లేకుండా ఆటో కార్మికులకు వర్తింప చేయాలి
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్
నమస్తే భారత్: అశ్వాపురం :అశ్వాపురం మండలం,అశ్వాపురం ఆటో స్టాండ్ వద్ద, ఆటో కార్మికుల సమావేశం ఏర్పాటు చేయడం అయినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున హాజరై మాట్లాడుతూ..రాజీవ్ యువ వికాస పథకాన్ని సిబిల్ స్కోరు ఆధారంగా అమలు చేయడం వలన ఆటో కార్మికులును ఇబ్బందులకు గురవుతారని, ఇప్పటికే బ్యాంకు బాధితులుగా మారిన ఎంతో మంది ఆటో కార్మికుల కుటుంబాలు గతంలో తీసుకున్న లోన్లు, వాటికి సంబంధించిన చెల్లింపులు కట్టని కారణంగా వారి సిబిల్ స్కోర్ దెబ్బ తినడం జరిగింది. ఇప్పుడు అదే సిబిల్ స్కోర్‌ను రాజీవ్ యువ వికాస పథకానికి అర్హతగా మారుస్తే, దాదాపు ఎంతోమంది ఆటో కార్మికుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ వలన ఆటో కార్మికులకు జీవన ఉపాధి కోల్పోయి వారి కుటుంబాలను పోషించుకోలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న ఆటో కార్మికులుకు సిబిల్ స్కోరు వంటి అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది అని, రాజీవ్ యువ వికాస పథకం ద్వారా అయినా ఆటో కార్మికులను ఆదుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పథకాలలో ఒకటైన మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో కార్మికులకు ఈ పథకం ద్వారా అయినా వారి కుటుంబాలు మెరుగుపడే విధంగా రాష్ట్ర కృషి చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు గద్దల రామకృష్ణ, ఏఐటీయూసీ మండల నాయకులు, బోయిళ్ళ రమణయ్య, మాదా రాంబాబు, కొము రాంబాబు, మడిపల్లి రమేష్, బోయిళ్ళ శ్రీను, తదితరులు పాల్గొన్నారు..
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

