మే 10న చేవెళలో జరుగు జిల స్థాయి సెమినార్ నుజయప్రదం చేయండి 

బుద్ధుల జంగయ్య పిలుపు 

మే 10న చేవెళలో జరుగు జిల స్థాయి సెమినార్ నుజయప్రదం చేయండి 

నమస్తే భారత్,షాద్ నగర్ మే08:భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గ కేంద్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో జిల్లా స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నాం జయప్రదం చేయండి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య తెలంగాణ గ్రామ పంచాయత్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టంగుటూరి నరసింహారెడ్డిలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సెమినార్ సంబంధించిన కరపత్రాన్ని వారు షాద్నగర్ బ్లాక్ ఆఫీస్ లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ మన భారతదేశంలో ఉంది వృత్తులను బట్టి కులాలు పుట్టాయని మనం పురాణాలలో చదువుకున్నాం కానీ కాలం మారుతున్న కొద్ది వృత్తులన్నీ కూడా అన్ని కులాలవారు చేస్తున్నారు కానీ కులం మాత్రం పోలేదు కులతత్వం మతతత్వం భారతదేశ రాజకీయాలను చాచిస్తున్నాయని కులం మతం  లేనిది రాజకీయాలు చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఇలాంటి తరుణంలో కుల వివేక్షత అంటరానితనం గ్రామాలలో పట్టిపీడిస్తున్న పరిస్థితి ఉంది నేటికీ కొన్ని గ్రామాలలో దళితులు గుళ్లో రానీయని పరిస్థితి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎవరి మత విశ్వాసాలు వారికి ఉన్నాయి కానీ ఒక మతం మీద ఇంకో మతం పెత్తనం చేయాలి అని నేడు మత విద్వేషాలు రెచ్చగొడుతూ నా మతమే గొప్పది అని మతపైన దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో అన్ని మతాలలోఉన్న పేద ప్రజలు గందరగోళం పడుతున్న పరిస్థితి ఉంది ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వారన్నారు భారతదేశం విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న సాంప్రదాయాలు గల దేశం ఈ దేశంలో అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఒకే రకమైన రాజ్యాంగం ఉంది రాజ్యాంగానికి లోబడే మన భారతదేశ రాజకీయాలు నడపబడాలి రాజ్యాంగం లో ఉన్న చట్టాలను సక్రమంగా అమలుకాని పరిస్థితి భారతదేశ ప్రజలకు సక్రమమైన పరిపాలన అందిస్తే సమస్య ఉండదు కానీ నేటికీ అసమానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది, ఈ ఇబ్బందులకు కారణం కులం మతం ఎవరి మత సాంప్రదాయాలు వారు పాటించుకోవచ్చు కానీ భారతీయులమైన మనం  మతసామరస్యాన్ని పాటించాల్సిన బాధ్యత భారతదేశ ప్రజలమైన మన అందరిపై ఉందని దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి ఉందాం అందట్లో మనం ఉందామని భావిస్తూ ఈ సెమినార్ నిర్వహిస్తున్నాం ఈ సెమినార్ కు ముఖ్య అతిథులుగా ఎస్ఎం ఖలీల్  సామాజిక ఉద్యమ నాయకులు పాలమాకుల జంగయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి కలకొండ కాంతయ్య  బి కే యం యు రాష్ట్ర అధ్యక్షులుహాజరవుతున్నారు. కావున కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఈ సదస్సుకు హాజరై జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ డివిజన్ ఉపాధ్యక్షులు కే రాజు నాయక్ కే మంజుల ఫరూఖ్ నగర్ మండల కార్యదర్శి గౌనికాడి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై దాడి సహించరానిది సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై దాడి సహించరానిది
గ్రామీణాభివృద్ధి సంస్థకు రాష్ట్ర అవార్డు
మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి
సట్ల లక్మీ దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన  మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్
ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి  యు డిఐఎస్ఈ ప్లస్ పోర్టల్ నందు నమోదు అవ్వాల్సిందే
మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు లో మంగళవారం పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు