మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి

మనువాద కార్పొరేట్ విధానాలపై కార్మిక వర్గంతో కలిసి నడవాలి

మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి

కెవిపిఎస్ గ్రామస్థాయి సమావేశంలో వక్తల పిలుపు


మే 20న జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన  దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలని  మనువాద కార్పొరేట్ విధానాలను అమలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బిజెపి విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు

నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్ బేతులు గ్రామస్థాయి కేవీపీఎస్ ఆధ్వర్యంలో మే 20 సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా ఈ సమావేశానికి కెవిపిఎస్ సూదనబోయిన వెంకన్న అధ్యక్షతన జరిగిన సభలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డేల రామ్మూర్తి మున్సిపల్ పట్టణ అధ్యక్షులు గద్దపాటి సంతోష్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా  కల్పించిన హక్కులను కూడా రక్షణ కరువైందన్నారు.11 ఏళ్ల మనువాద బిజెపి విధానాలు అట్టడుగు పేదల జీవితాలను మరింతగా దుర్భరం చేశాయన్నారు .దేశంలో 200 మంది కోటీశ్వరులు ఆస్తులు దేశంలో 40 శాతం మంది ప్రజల ఆస్థితో సమానమైందన్నారు మరో వైపున 40కోట్ల మంది మన భారతీయులు దారిద్య్రరేఖకు దిగువన వున్నారని చెప్పారు. బిజెపి విధానాలు కార్పొరేట్ దిగ్గజాలకు వరాలు కురిపిస్తూ కష్టజీవులపై భారాలు వేస్తుందన్నారు స్వాతంత్రం కంటే ముందు నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న.29 కార్మిక చట్టాలను బీజేపీ సర్కార్ రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చిందన్నారు  రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్19 ప్రకారం సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు ,కనీస వేతనం పొందే హక్కులనుండి కార్మికులను దూరం చేస్తుందన్నారు తన మతోన్మాద కార్పొరేట్ విధానాలతో రాజ్యాంగ విరుద్ధంగా కార్మిక హక్కులను  కాలరాస్తుందన్నారు  కార్మికుల శ్రమను దోచి కార్పొరేట్ దిగ్గజాలకు దాచిపెడుతుందన్నారు అంబానీ ఆదాని లాంటి అపర కుబేరుల ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా చూస్తుందన్నారు నూటికి 80శాతం మంది దళితులు గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో జాబు కార్డులు కలిగి ఉండి ఉపాధి కోసం రోజువారి పనికి వెళ్తున్నారని,దళితులకు ఆ ఉపాధికూడా లేకుండా చేయటానికి కేంద్ర బిజెపి సర్కార్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు   80 కోట్ల మంది ప్రజలకు ఉపాధి నిచ్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ లో కేవలం 86వేలకోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందన్నారుఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి సర్కార్ 11 ఏళ్ల కాలంలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, ఉన్న ఉద్యోగాలను తొలగించిందన్నారు  ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం ద్వారా సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తుందన్నారు 15% ఉన్న ప్రైవేటు రంగం నేడు 85 శాతానికి పెరిగితే 85% ఉన్న ప్రభుత్వ రంగం 15 శాతానికి దిగజార్చిందన్నారు ఫలితంగాఅట్టడుగు వర్గాలు  రాజ్యాంగబద్ధంగా కల్పించబడ్డ రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు  ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేకపోవడంతో అట్టడుగు వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలనే ఒక సామాజిక న్యాయ డిమాండ్ కోసం అట్టడుగు వర్గాలు ఐక్యం కావలసిన ఆవశ్యకత ఉందన్నారు బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై  300 రేట్లు  దౌర్జన్యాలు పెరిగాయని బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రత్యేకించి దళితులను టార్గెట్ చేసుకొనిమూక దాడులు జరుగుతున్నాయని చెప్పారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారంగా జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించలేదన్నారు. 20 శాతం ఉన్న దళితులకు కేవలం ఐదు శాతం మాత్రమే బడ్జెట్లో నిధులు కేటాయించారని చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారు6 లక్షల బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్న ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం. ప్రభుత్వ రంగ సంస్థలను, రిజర్వేషన్లను కాపాడుకుంటూనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు  ఆ వెలుగులో కార్మిక సంఘాలు తలపెట్టిన జాతీయస్థాయి సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులుగా సమైక్యంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ ఖాదర్ బాబా గుండెల వెంకటేష్ యాకూబ్ రమేష్ దూలూరి సందీప్ షేక్ సర్వర్ షబ్బీర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై దాడి సహించరానిది సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై దాడి సహించరానిది
గ్రామీణాభివృద్ధి సంస్థకు రాష్ట్ర అవార్డు
మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి
సట్ల లక్మీ దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన  మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్
ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి  యు డిఐఎస్ఈ ప్లస్ పోర్టల్ నందు నమోదు అవ్వాల్సిందే
మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు లో మంగళవారం పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు