త్రాగునీరు సరఫరా,ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం, అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి,లతో కలిసి కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీరు సరఫరా, రాజీవ్ యువ వికాసం పథకం తదితర అంశాలపై ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్, పంచాయతీ విస్తరణ అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకం అర్హులైన నిరుపేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మాణం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు తీసుకున్న సూచనలు నిబంధనల ప్రకారం సర్వే, వెరిఫికేషన్ చేసి అర్హులైన వారిని గుర్తించి చెక్ లిస్ట్ ప్రకారం సరి చూసుకోవాలన్నారు. జిల్లాలో వేసవి కాలం నేపథ్యంలో ప్రజలకు త్రాగునీరు సరఫరాలో ఆటంకం కలగకుండా చూసుకోవాలని, అవసరం ఉన్న చోట స్థానిక వాటర్ సోర్సెస్లను వాటర్ ట్యాంకర్లను హైర్ చేసుకుని వినియోగించు కోవాలన్నారు. మిషన్ భగీరథ, మున్సిపల్, పంచాయితీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పైప్ లైన్లు డ్యామేజ్ కాకుండా చర్యలు తీసుకోవాలని, నీరువృధా కాకుండా చూసుకోవాలన్నారు.ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వాటర్, ఓవర్ హెడ్ ట్యాంకర్లు ద్వారా క్లోరినేషన్ చేసి నీరు సరఫరా చేయాలన్నారు.గ్రామాల్లో, పట్టణాల్లో మిషన్ భగీరథ నీరు ఓపెన్ వెల్స్ నల్లా ద్వారా వచ్చే నీరు వృధా కాకుండా వాటర్ మెన్ ల ద్వారా నిరంత పర్యవేక్షణ చేయాలన్నారు.రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతి, యువకుల హార్డ్ కాపీలను పరిశీలించి బ్యాంకులకు జాబితాను పంపాలని, ప్రభుత్వ సూచనల ప్రకారం లబ్ధిదారులకు వేగంగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సేవలను అందించాలన్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎస్బీఎం ) నిధుల ద్వారా గ్రామీణా, పట్టణ ప్రాంతాల్లో టాయిలెట్స్, ఇంకుడు గుంతలు, నిర్మించాలని, ప్రభుత్వ సంస్థలలో అవసరం ఉన్న చోట్ల కమ్యూనిటీ సోక్ఫిట్స్ , జిల్లాలోని కొత్త గ్రామపంచాయతీలలో సెగ్రిగేషన్ షెడ్స్ నిర్మాణం కోసం ప్రతి పదాలను పంపాలన్నారు.స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా చేపట్టే ప్రతీ కార్యక్రమాలను పక్కగానిర్వహించాలని సూచించారు .ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో పురుషోత్తం, డీఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిపిఓ హరిప్రసాద్, బీసీ, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అధికారులు నరసింహ స్వామి, శ్రీనివాస్ రావు, శ్రీనివాస్, హౌజింగ్ పిడి రాజయ్య, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ , మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్లు శాంతికుమార్, నరేష్ రెడ్డి, ఉదయ్, డిఈ ఉంపేందర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, ఎంపీడీవోలు, ఎంపీఓలు , తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

