ప్యాట జయ శ్రీకాంత్ ఆధ్వర్యంలో చౌదరిగూడ మండలంలో మహిళా నాయకత్వానికి బలమైన పునాది….
పోరాడుదాం బీసీ ల రాజ్యం సాధించేంత వరకు
నమస్తే భారత్,షాద్ నగర్ మే03:చౌదరిగూడ మండలం గాలిగూడ గ్రామంలో బీసీ సేన చౌదరిగూడ మండల మహిళా మండల అధ్యక్షురాలు ప్యాట జయ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో వార్డుల వారిగా మహిళా కమిటీలను నియమించడం జరిగింది ఈ కార్యక్రమానికి బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ ముదిరాజ్ గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారు జిల్లా యువత అధ్యక్షులు శివ గారు జిల్లా నాయకులు సదర్ శ్రీను గారు అసెంబ్లీ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్పా గారు,అసెంబ్లీ మహిళా అధ్యక్షులు వరలక్ష్మి గారు అసెంబ్లీ మహిళా కన్వీనర్ చెరుకు మమత గారు పరుఖ్ నగర్ మండల అధ్యక్షులు మేకల వెంకటేష్ గారు పరుఖ్ నగర్ మహిళా అధ్యక్షులు జలజ గారు టౌన్ మహిళా అధ్యక్షులు భాగ్యలక్ష్మి గారు నాయకులు స్రవంతి తదితరులు హాజరై మాట్లాడుతూ మా చౌదరిగూడ మండలంలో, గాలిగూడ గ్రామంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరై ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించిన మా బీసీ సేన మహిళా మండల అధ్యక్షురాలు శ్రీమతి ప్యాట జయ శ్రీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.బీసీల హక్కులు – ఇవి మాకు ఎవరు బహుమానం ఇచ్చింది కాదు. ఇవి మా కష్టంతో, పోరాటంతో సంపాదించుకున్న హక్కులు. అనేక దశాబ్దాలుగా బీసీ వర్గాలు దేశాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించాయి. కానీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉండేలా చేస్తున్న యవస్తాను మార్చడం కోసం బీసీ సేన ఏర్పడింది.ఈరోజు మనం మహిళా కమిటీలను నియమించడం ఒక చిన్న కార్యక్రమం కాదు – ఇది ఒక పెద్ద మార్పు దిశగా తీసుకున్న తొలి అడుగు. మహిళల పాత్ర ఇప్పుడు మరింత కీలకం అయింది. ప్రతి ఇంటిలో, ప్రతి కాలనీలో, ప్రతి వాడలో బీసీ మహిళలు నడిపించే సంఘటనలు మనం చూడాలి.నాయకత్వం అణగారిన వర్గాల నుండి రావాలి. మన బీసీ యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలి. ఇవాళ ఏర్పడిన కమిటీలను చూస్తే గర్వంగా ఉంది. మీరు ఒక్కొక్కరు ఓ పిల్లర్ లాంటి నాయకురాలు కావాలి. ప్రతి బీసీ ఇంటికి మీరు సపోర్ట్ కావాలి. ఈ పోరాటం మనకోసం కాదు, మన తరువాతి తరం కోసం. నేడు మీరు చూపిన నాయకత్వం, రేపు ఈ గ్రామం మారడానికి కారణం అవుతుంది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

