నిర్మల్ పోలీస్.. మీ పోలీస్..
భైంసా పట్టణంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఫిర్యాదుల స్వీకరణ
జీ నెట్వర్క్ నుండి తెలంగాణ రియల్ హీరోస్ అవార్డ్ గ్రహీత ఇన్స్పెక్టర్ గోపినాథ్ నీ అభినందించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్.
తేదీ మే , 07, 2025
నమస్తే భరత్
నిర్మల్ జిల్లా // బైంసా పట్టణంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గత వర్షాకాలంలో 100 డైల్ కి స్పందించి నిండు ప్రాణాలని కాపాడినందుకు జీ నెట్వర్క్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి చేతులమీదుగా తెలంగాణ రియల్ హీరోస్ అవార్డుని అందుకున్న భైంసా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోపినాథ్ నీ జిల్లా ఎస్పీ అభినందించారు. బుధవారం బైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి బైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ల ద్వారా బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. షి టీమ్ సిబ్బంది తో కొన్ని కుటుంబ కలహాల కేసులలో ఇరు పార్టీ వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం జరిగింది. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులను ఇప్పటి వరకు ఎన్ని పరిష్కారం అయ్యాయో మరియు పెండింగ్ పిర్యాదుల పురోగతిని గురించి సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమం లో Asp అవినాష్ కుమార్ ఐపిఎస్, ఇన్స్పెక్టర్ లు గోపినాథ్, మల్లేష్, ఎస్ఐ లు శంకర్, గణేష్, షి టీమ్ ఇంచార్జి మహిళా ఎస్ఐ పెర్సిస్ , షి టీమ్ సిబ్బంది, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

