మక్తల్ లో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ ఆవిష్కరణ కు ఆర్థికంగా హార్దికంగా సహకరించి మక్తల్ వ్యాపారస్థులు, ప్రజానీకానిక ధన్యవాదములు
నమస్తే భరత్, 6/5/2025/ నారాయణపేట జిల్లా : సి పి ఐ ( ఎం ఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ( భగత్ సింగ్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు) మక్తల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ విగ్రహానికి మక్తల్ ప్రజానీకం ఆర్థికంగా హార్థిక సహకరించిన వారందరికీ పిడిఎస్యు, పి వై ఎల్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్,, భగత్ సింగ్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ. ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సి పి ఐ ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ( భగత్ సింగ్ విగ్రహ ప్రతిష్టపన కమిటీ) ఎం కిష్టారెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను రుణ ప్రయాణం కల్పించిన భగత్ సింగ్ లాంటి యువ కిశోరాలను బ్రిటిష్ వాళ్ళు ఉరితీయడం జరిగింది. భగత్ సింగ్ లాంటి వాళ్ళని నేను యువత ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు. నేటి యువత చెడు వ్యసనలను బానిసలూ గా కాకుండా జాతీయ అమరవీరుల స్ఫూర్తిని తీసుకోవాలని అన్ని అన్నారు. నేడు దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఒక్కరిమీద ఒక్కరు మాట్లాడుకుంటూ కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని అన్నారు విద్యార్థులు, యువకులు, ప్రజలు ఎప్పటికప్పుడు రాజకీయనాయకులు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ఉండాలని అన్నారు. నేటి పరిస్థితులలో భగత్ సింగ్ లాంటి యువకిశోరాల త్యాగం ను ఆదర్శం గా తీసుకోవాలని అందులో భాగంగా నే మక్తల్ పట్టణ కేంద్రంలో భగత్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం దానికి ప్రజల ఆదరణ చూపడం చూపించడం చాలా సంతోషకరమైన విషయం మక్తల్ లో ఆర్థికంగా హార్థికంగా సహకరించిన వ్యాపారస్థులకి, సానుభూతిపారులకి, ప్రజలకి ధన్యవాదములు తెలుపుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమం లో సి పి ఐ ఎం ఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి సలీమ్, TUCI జిల్లా అధ్యక్షులు కిరణ్ AIUKS జిల్లా అధ్యక్షులు ( భగత్ సింగ్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ కార్యదర్శి ) భగవంతు పి డీ ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. భాస్కర్, పి వో డబ్లు జిల్లా అధ్యక్షురాలు శారద, AIUKS జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, పాతపల్లిమాజీ సర్పంచ్ కృష్ణయ్య, నాయకులు Y. రాజు, చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

