జర్నలిస్టుల సంక్షేమం ఎక్కడ?

జర్నలిస్టుల సంక్షేమం ఎక్కడ?

* పాలకులు మారుతున్న మారని జర్నలిస్టుల బతుకులు
* హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలి
* తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య 

నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం  బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వాలు మారిన జర్నలిస్ట్ ల సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు.  వెంటనే ఇండ్ల స్థలాలు హెల్త్ కార్డులు అక్రిడియేషన్స్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాళ్ల బండి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బసవ పున్నయ్య  ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జర్నలిస్టులు ప్రాణాలు తెగించి ఉద్యమంలో ముందు భాగాన నిలిచారని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వచ్చిన  ప్రభుత్వాలు జర్నలిస్టు సమస్యలను విస్మరించి వారి మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నాయని అన్నారు. హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు 500 మంది జర్నలిస్టులపైగా చనిపోయారని  అన్నారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు వృత్తిపరమైన బాధ్యతలు పెరిగినప్పటికీ వారికి సామాజిక భద్రత లేకుండా పోయిందని అన్నారు. వారిపై జరుగుతున్న దాడులకు వెంటనే రక్షణ చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. మృతి చెందుతున్న వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో  అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని పెండింగ్ లో ఉన్న అక్రిడేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు సైతం వారి వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపులు పొందాలని పేదల పక్షాల నిలబడి ప్రభుత్వ పథకాలువారికి అదే విధంగా వార్త కథనాలు ప్రచురించాలని అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండ కట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈ.చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్ మాట్లాడుతూ విలువలు విశ్వాసనీయత ఆధారంగా జర్నలిజం పరిరక్షణ కోసం కృషి చేయాలనీ కోరారు. ఫెడరేషన్ నాటి నుంచి నేటి వరకు జర్నలిస్టుల హక్కుల కోసం ఉద్యమిస్తున్నాదని తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ కార్యదర్శి కె.శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం జిల్లా దిశ రిపోర్టర్ సతీష్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు దాసరి వెంకటేశ్వరరావు, రాళ్ల బండి కృష్ణమూర్తి కొండ్రు వేణు, దమ్మాలపాటి వెంకన్న, సోమనపల్లి వెంకటేశ్వర్లు, నంది పాటి రమేష్, జిల్లాలోని  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులు,  తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది  హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది 
నమస్తే భారత్ / మద్దూరు, (మే 6)  : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం  విఫలమయిందని కొత్తపల్లి మండలం టిఆర్ఎస్...
త్రాగునీరు సరఫరా,ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం, అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
నర్కుడలో రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
జర్నలిస్టులందరికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి 
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి