సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై దాడి సహించరానిది
విద్యార్థి సంఘం నేత కోటా శివశంకర్
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పోలీసుల దౌర్జన్యాల తీరును దాడి చేయడాన్ని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావాలని సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. నిర్భయంగా నీతి నిజాయితీగా వార్తలు రాస్తే కావాలని కేసులు నమోదు చేయడం ఇదంతా పత్రిక స్వేచ్ఛను భావ ప్రకటన స్వేచ్ఛను భంగం కలిగించడమేనని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టులు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసుని ఎత్తివేయాలని అదేవిధంగా అన్యాయంగా అక్రమంగా ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసులు చొరబడడం దాడి చేయడం అక్రమంగా ఇంట్లోకి చొరబడడం ఇలాంటివన్నీ పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఈ చర్యలను తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఇలాంటి సంఘటనలు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పోలీసులు మానుకోవాలని లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం హెచ్చరిస్తుందని కోట శివశంకర్ పేర్కొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
