స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు
On
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: అవకాశం ఉన్న ప్రతి బ్యాంక్ బ్రాంచ్ లోనూ ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాల పరిరక్షణకు ఈ ఇంకుడు గుంతలు ఎంతగానో ఉపయోగపడతాయని నీటి వనరుల సంరక్షణ భావితరాలకు శ్రీరామ రక్ష అని అన్నారు. ఎస్.బి.ఐ. రుద్రాంపూర్ బ్రాంచ్ లో ఇంకుడు గుంత తవ్వే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఈశ్వర్ రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, హెచ్.ఆర్. మేనేజర్ రాములు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")


Error on ReusableComponentWidget