భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'పేట'లో మెగా జాబ్ మేళా
---వందలాదిగా హాజరైన నిరుద్యోగ యువత
---ఉద్యోగాలు రావడంతో మురిసిపోయిన నిరుద్యోగులు
---నిరుద్యోగుల నుండి భారీ స్పందన
నమస్తే భారత్ /నారాయణపేట్ జిల్లా : భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో శనివారం నారాయణపేట పట్టణంలోని ఎస్.ఆర్.గార్డెన్స్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నారాయణపేట జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. అంతకుముందు తనకు విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులచే డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయించి కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. తాను పుట్టిన గడ్డను అభివృద్ధి చేసుకునే క్రమంలో రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేటలో ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం హర్షనీయమని అన్నారు. ఇప్పటికే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, లాప్ టాపుల అందజేత, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించడం, అనేక దేవాలయాల పునర్మిణాలకు సహకరించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమంలో భాగంగా మెగా ఉద్యోగ మేళాను నిర్వహించినట్లు తెలిపారు.భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణంలో శనివారం నిర్వహించిన మెగా జామేలకు నిరుద్యోగుల నుండి విశేష స్పందన లభించింది. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించడమే ఏకైక లక్ష్యంగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి మెగా జాబ్ మేళా ను నిర్వహించి ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించడం పట్ల నిరుద్యోగుల కుటుంబ సభ్యులు, జాబ్ మేళాకు వచ్చిన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లాలో ఉన్న నిరుద్యోగుల కోసం ఇప్పటివరకు మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయలేదని, భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి తమకు ఉద్యోగాలు కల్పించడం సంతోషంగా ఉంది అని పలువురు నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి జాబ్ మేళాను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అనంతరం వివిధ కంపెనీలలో ఇంటర్వ్యూలకు హాజరై 380 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా, అందులో 80 మంది నిరుద్యోగ యువతకు భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు రావడంతో నిరుద్యోగులు మురిసిపోయారు. అంతకుముందు నిర్వాహకులు వివిధ కంపనీల ప్రతినిధులను, అధ్యాపకులను, ఫౌండేషన్ సభ్యులను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మణిమాల, వేణుగోపాల్, అంజయ్య, ఫౌండేషన్ సభ్యులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
