ఆరోగ్య పరిరక్షణ క్రమశిక్షణ గురించి వీక్లీ పెరేడ్ 

హోంగార్డు నుండి అధికారుల  వరకు ఒకే కుటుంబ సభ్యులుగా విధులు నిర్వహించి డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకుని రావాలి 

ఆరోగ్య పరిరక్షణ క్రమశిక్షణ గురించి వీక్లీ పెరేడ్ 

ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ జోలికి వెళ్ళవద్దు వెళ్లి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

మోటార్ సైకిల్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి  

వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి  ఫిజికల్ ఫిట్నెస్

గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి 

 ఆరోగ్య పరిరక్షణ గురించి వీక్లీ పెరేడ్ 

విధినిర్వహణ ఎంత ముఖ్యమో, ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యం 

 ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్

 

నమస్తే భారత్ : ఈ రోజు సిద్దిపేట పెద్ద కోడూర్ గ్రామ శివారులో ఉన్న సిఏఆర్ హెడ్ క్వార్టర్ లో  జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, సిబ్బందికి  వీక్లీ పరేడ్ పోలీస్ కమిషనర్ మేడమ్ గారి ఆదేశానుసారం  నిర్వహించడం జరిగింది. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, గారు సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్  ప్రదర్శనని పరిశీలించారు.ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ డీసీపీ  మాట్లాడుతూ వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని,  సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫిట్నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు.  గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి, విధినిర్వహణ ఎంత ముఖ్యమో, ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యం, ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ జోలికి వెళ్ళవద్దు వెళ్లి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకో వద్దు, మోటార్ సైకిల్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి, ఇతర సమస్యలు ఏమన్నా ఉంటే పై ఆఫీసర్లకు చెప్పుకునే వీలుంటుందని. చెడు అలవాట్లకు లోనుకాకూడదు అన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని జిల్లాకు, తెలంగాణ పోలిస్ శాఖకి మంచిపేరు తీసుకురావాలన్నారు. సిబ్బందికి చేయవలసిన విధులు ,చేయకూడని పనుల గురించి పలు సూచనలు చేయడం జరిగింది. ఏదైనా వ్యక్తి గత సమస్యలు ఉన్న, డ్యూటీల వద్ద సమస్య ఉన్న, ఆరోగ్య సమస్య ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు  అలవాటు పడి, విధులలో నిర్లక్ష్యం వహించినట్లైతే, పోలీస్ శాఖ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించరాదని హెచ్చరించారు. మరియు రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు.వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు.మరియు సమయం దొరికినప్పుడు భార్యా పిల్లలతో ఉల్లాసంగా గడపాలని సూచించారు. మరియు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని తెలిపారు. సైబర్ నేరాలు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్, ఆడి జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. సర్వేసుకు సంబంధించిన మరియు వ్యక్తిగతంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ విధుల గురించి  పెరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు  పూర్ణ చందర్, ధరణి కుమార్, రాజేష్, విష్ణుప్రసాద్, కార్తీక్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, మరియు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం. ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం.
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్-మరిపెడ జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహం ఆవిష్కరణకు ముందే ప్రజలకు దర్శనం ఇస్తోంది.ఇటీవల గాలిదుమ్ములకు విగ్రహానికి కప్పి...
పేదలకు దక్కని ఇందిరమ్మ ఇల్లు 
ముదిరాజ్ ల సంక్షేమం కోసం కృషి చేస్తా
తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్  మొదటి  సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.
సారయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
దేవయ్య చిత్రపటానికి నివాళులర్పించిన   సిపిఎంజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాలా వీరయ్య 
కేంద్ర ప్రభుత్వం కులగన లెక్కల నిర్ణయం శుభ పరిణామం