నిర్మల్ పోలీస్.. మీ పోలీస్..
వీక్లీ పరేడ్ వల్ల పోలీసు సిబ్బందికి మంచి ఆరోగ్యం విధినిర్వహణ ఎంత ముఖ్యమో, ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యం
నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్...
తేదీ, 03.05.2025
నమస్తే భరత్ : జిల్లా పోలీస్ సాయుధ దళ ముఖ్య కార్యాలయం పరెడ్ గ్రౌండ్ నందు పోలీసు సిబ్బందికి నిర్వహించిన వీక్లీ పరేడ్ ను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... వీక్లీ పరేడ్ అనేది సిబ్బందికి, క్రమ శిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని, సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫిట్నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. ఈ పరేడ్ లో ఏఎస్పీ రాజేష్ మీన ఐపిఎస్, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్ రెడ్డి, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, కృష్ణ , ఆర్.ఐ లు రాం నిరంజన్ రావు, శేఖర్, రమేష్ , రామ కృష్ణ, ఎస్ఐ లు , ఆర్.ఎస్ఐ లు, ప్రొబేషనరీ ఎస్ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

