హత్య కేసులో నిందితుడికి  జీవిత ఖైదు

On

 

నమస్తే భారత్ (ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 18_) కొత్తగూడెం లీగల్:  హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు  విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా.. కొత్తగూడెం రామవరం కు చెందిన కోరీ శ్రీకాంత్ ఫిర్యాదు ప్రకారం కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రంపూర్ తిలక్ నగర్ ఏరియాలో 10.05.2024 న తన మేనత్త లోద్ దూలారీ బాయి లోద్ శ్యామ్ లాల్ వారి కుమారుడు లోద్ రమేష్ వారి సొంత ఇంటిలో నివాసం ఉంటున్నాడు  రమేష్ కు 13 సంవత్సరాలు క్రితం వివాహం జరిగి , ఇద్దరు పిల్లలు,తన భార్య గొడవ పెట్టుకుని వెళ్లిపోయినదని అతను లారీ డ్రైవర్ గా పనిచేస్తూ త్రాగుడుకు బానిస అయ్యాడని గతంలో 2015 సంవత్సరం వీరిద్దరిని చంపే ప్రయత్నం చేయగా టు టౌన్ పోలీస్ వారు  కేసు నమోదు చేశారు ఆ కేసులో  కోర్టులో రాజీపడినారని తదుపరి 2024.05.10 న రమేష్ చికెన్ తెచ్చి తన అమ్మకు ఇచ్చి  చికెన్ వండించగా  తనకు ఆ చికెన్ సరిపోలేదని కావాలని గొడవపడి చంపాలని ఉద్దేశంతో వారిద్దరిని రాడ్డు తో కత్తితో దాడి చేయగా దూలారీ బాయి తల కు కాలు చేతులకు బలమైన దెబ్బలు తగిలినవి, అదేవిధంగా తండ్రి శ్యామ్లాలాల్ ను  ఎక్కడపడితే అక్కడ బలం గా కొట్టాడని తీవ్ర రక్త గాయాలైనయని  అట్టి గొడవలో అడ్డుగా వెళ్లిన రమేష్ పిల్లలు  కుమారుడు గణేష్ మరియు కూతురు గుణవతిని కూడా  బలంగా కొట్టాడని వారికి రక్తం కారు చుండగా అది చూసి  లోద్ రమేష్ పారి పోయినాడు, అని వెంటనే ఆ నలుగురిని 108 ద్వారా లోద్ శ్యామ్ లాల్ ను  దూలారీ బయినీ, గణేష్, గుణవతి లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ న్నారని ఫిర్యాదు ఇచ్చినారు,  తిలక్ నగర్ రుద్రంపూర్ కు చెందిన లోద్ రమేష్ దాడి చేసిన ఘటనలో ఫిర్యాదు అందుకున్న కొత్తగూడెం2  టౌన్ సబ్ ఇన్స్పెక్టర్  ఇ.రాజేష్  కేసు నమోదు చేసినారు, 2024.05.14 న చికిత్స పొందుతున్న దులారి బాయి చనిపోయినది, అట్టి కేసు విషయంలో అప్పటి ఇన్స్పెక్టర్ టి రమేష్ కుమార్  దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు .కోర్టులో 15 మంది సాక్షులను విచారించారు.  ఇరుపక్షాల వాదోపవాదాలు విని లోద్ రమేష్  పై నేరం ఋజువు కాగా, భారత శిక్షాస్మృతి 302 ప్రకారం జీవిత ఖైదు ₹1000 జరిమానా వేయి రూపాయల చెల్లించని పక్షంలో నాలుగు నెలల కారాగార శిక్ష ,307 ప్రకారము ఐదు సంవత్సరంలో జైలు శిక్ష 500 రూపాయల జారిమానా , జరిమానా చెల్లించనీ యెడల ఒక నెల సాధారణ జైలు 324 ప్రకారం 2 సంవత్సరంలో జైలు శిక్ష 500 రూపాయల  జరిమానా చెల్లించనీ యడల ఒక నెల సాధారణ జైలు శిక్షణ విధిస్తూ తీర్పు చెప్పారు..అనంతరం ప్రస్తుత కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి . ప్రతాప్ ఇట్టి కేసు విచారణను ముందుకు సాగించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి లక్ష్మీ ప్రాసిక్యూషన్ నిర్వహించగా,  నోడల్ ఆఫీసర్ డి.రాఘవయ్య,  కోర్టు లైజన్ ఆఫీసర్ ఎన్.వీరబాబు ( కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ ) కోర్టు పి.సి. ఎల్. బిక్కు లాల్ లు సహకరించారు.

Tags

Share On Social Media

Latest News

హత్య కేసులో నిందితుడికి  జీవిత ఖైదు హత్య కేసులో నిందితుడికి  జీవిత ఖైదు
    నమస్తే భారత్ (ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 18_) కొత్తగూడెం లీగల్:  హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు  విధిస్తూ భద్రాద్రి
యడ్లపాడులో పోలీసుల దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలి 
నిరుపేద కుటుంబనికి ఆర్థిక సహాయం
కుట్ర చేసే బయటకు పంపారు
చిన్నారుల అదృశ్యం కేసుల‌పై సుప్రీంకోర్టు ఆందోళ‌న‌
హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్‌
దళిత ఆత్మగౌరవ సభ: జస్టిస్ గవాయిపై దాడిని నిరసిస్తూ ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ ధర్నా! 

Advertise