రైతుల సేవలో టిడిపి ప్రభుత్వం
- రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్
వెల్దుర్తి (నమస్తే భారత్) కర్నూలు జిల్లా రిపోర్టర్ చిప్పగిరి రాము:- వెల్దుర్తి రైతుసేవా కేంద్రంలో ఏర్పాటుచేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతులకు వ్యవసాయం లాభసాటి చేసేలా ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.6310 కోట్లు జమ చేసిందన్నారు. 90 శాతం సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలను అందిస్తున్నామన్నారు. విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై రైతులకు అందిస్తున్నామన్నారు. రైతులకు రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు. పత్తికొండ నియోజకవర్గం లో అన్ని మండలాల చెరువులకు నీటిని అందించమన్నారు. ఈ ఘనత మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కే.ఈ.కృష్ణమూర్తి గారికి దక్కుతుందన్నారు. అంతకుముందు
సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన వ్యవసాయ ఉత్పత్తులైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలను గారు పరిశీలించారు. కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ గౌడ్, సుబ్బరాయుడు, సింగిల్ విండో చైర్మన్ రమాకాంత్ రెడ్డి, ఆయా శాఖకు చెందిన ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
