సిఐటియు ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయండి.
:- సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర
పత్తికొండ(నమస్తే భారత్) :
డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే సిఐటియు ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని పిసి మాడలో ఆశ వర్కర్ల సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మహాసభల పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతనం తక్షణమే ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతామన్న మూడు వేల రూపాయలను వెంటనే పెంచాలన్నారు. ఆల్ ఇండియా మహాసభల్లో అన్ని రంగాల స్కీమ్ వర్కర్లు పాల్గొంటారని స్కీం వర్కర్లు సంఘటిత అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభలో వక్తలు ప్రసంగిస్తారన్నారు. జనవరి 4న జరిగే మహా ప్రదర్శనలో స్కీం వర్కర్లు ఆశ వర్కర్లు అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన అన్నారు. ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా యావత్తు కార్మిక వర్గాన్ని ఐక్యపరచడం సిఐటియు అంశమని కార్మిక కర్షక ఐక్యతతో పెట్టుబడిదారీ విధానాన్ని కూల్చి కార్మిక రాజ్యాన్ని స్థాపించడం సిఐటియు లక్ష్యమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు ఏ, రాములమ్మ,కే. కృష్ణవేణి, రమాదేవి, గీతాంజలి, తాయమ్మ, సరస్వతి, వరలక్ష్మి, సిమ్లాబాయి, మల్లమ్మ, స్వాతి, ధనలక్ష్మి, సుశీలమ్మ, లక్ష్మీనరసమ్మ, రేవతి, ఉమా, వన్ మోర్ బి, సుధారాణి, మనోహర్ అమ్మ, చంద్రమ్మ, రేణుక ఎల్లమ్మ,ఆదిలక్ష్మి, హుస్సేన్వి ఆదేశ్వరి నాగవేణి పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
