కొలువుదీరిన  కొత్త పాలకవర్గం..

On
కొలువుదీరిన  కొత్త పాలకవర్గం..

 

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.

నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్. 

మహేశ్వరం, డిసెంబర్ 3, నమస్తే భారత్ న్యూస్ ప్రతినిధి: 

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం జెన్నాయిగూడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా కొలువుదీరిన దేవాలయ చైర్మన్ కోట గళ్ళ రంజిత్ కుమార్ ఇతర డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అయన కమిటీ సభ్యులను అభినందించారు. కేఎల్ఆర్ మాట్లాడుతూ.. జెన్నాయిగూడ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మాదిరిగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. దేవాలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆయన కోరారు. దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పాలకవర్గానికి సూచించారు. దేవాలయ కమిటీ నూతన చైర్మన్ గా కోట గల్ల రంజిత్ కుమార్ డైరెక్టర్లుగా జమ్మల నారాయణరెడ్డి, సౌకుంట్ల సుప్రజా, పాశం రవీందర్, సొప్పారీ దర్శన్, ఈవో శ్రీనివాస్, అజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణ నాయక్, వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, సీనియర్ నాయకులు ఏనుగు జంగారెడ్డి, బొక్క జంగారెడ్డి, శివగల్ల యాదయ్య, పాండురంగారెడ్డి, బంటు దనుంజయ్ ముదిరాజ్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise