అన‌ధికార టెస్టులో కేఎల్ రాహుల్ సెంచ‌రీ

On
అన‌ధికార టెస్టులో కేఎల్ రాహుల్ సెంచ‌రీ

నార్తాంప్ట‌న్‌: ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో ప్రారంభ‌మైన రెండో అన‌ధికార టెస్టులో.. ఇండియా ఏ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన రాహుల్ 151 బంతుల్లో సెంచ‌రీ పూర్తి చేశాడు. అత‌ను 168 బంతుల్లో 116 ర‌న్స్ చేసి నిష్క్ర‌మించాడు. అన‌ధికార టెస్టు తొలి మ్యాచ్‌కు దూర‌మైన రాహుల్‌.. రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వ‌చ్చేశాడు. అయితే వ‌చ్చీరాగానే అత‌ను సెంచ‌రీతో క‌దంతొక్క‌డం విశేషం. ఆరంభంలో ఇండియ‌న్ జ‌ట్టు రెండు వికెట్ల‌ను కోల్పోయింది. జైస్వాల్ 27 ర‌న్స్ చేసి నిష్క్ర‌మించాడు. అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్ 11 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. అయితే మూడో వికెట్‌కు క‌రుణ్ నాయ‌ర్‌తో కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఆ ఇద్ద‌రి మ‌ధ్య మూడో వికెట్ 86 ప‌రుగుల భాగ‌స్వామ్యం ఏర్ప‌డింది. తొలి అన‌ధికార టెస్టులో అద్భుత‌మైన రీతిలో డ‌బుల్ సెంచ‌రీ చేసిన క‌రుణ్ నాయ‌ర్‌.. రెండో మ్యాచ్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 71 బంతుల్లో 40 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు.

 

 

About The Author

Tags

Share On Social Media

Related Posts

Latest News

RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు
RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలో వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద‌సంచల‌న్ కార్య‌క్ర‌మం నిర్వహించారు. చేవెళ్ల గ్రామ రచ్చబండ హనుమాన్ దేవాలయం...
Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు

Advertise