బుమ్రా అంశంలో ప్లాన్ మార్చేది లేదు : గౌతం గంభీర్

On
బుమ్రా అంశంలో ప్లాన్ మార్చేది లేదు : గౌతం గంభీర్

లీడ్స్: ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో ఇండియా ఓడిన విష‌యం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ప్ర‌ధాన బౌల‌ర్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయ‌లేదు. ఇంగ్లండ్‌తో ఆడే అయిదు టెస్టుల సిరీస్‌లో కేవ‌లం మొద‌టి మూడు టెస్టుల‌కు మాత్ర‌మే బుమ్రాను ఎంపిక చేశారు. ప్ర‌స్తుతం తొలి టెస్టు ఓడిన నేప‌థ్యంలో.. ఆ ప్లాన్‌ను ఎటువంటి మార్పు చేసేది లేద‌ని ప్ర‌ధాన కోచ్ గౌతం గంభీర్తె లిపారు. వాస్త‌వానికి హెడ్డింగ్‌లీ పిచ్‌పై బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ ఇంగ్లీష్ బ్యాట‌ర్ల వికెట్ల‌ను తీయ‌డంలో భార‌త్ విఫ‌ల‌మైంది. రెండో ఇన్నింగ్స్‌లో 371 ర‌న్స్ టార్గెట్‌ను ఇంగ్లండ్ చాలా సులువుగా ఛేజ్ చేసింది.వ‌ర్క్ లోడ్ మేనేజ్మెంట్ వ‌ల్ల బుమ్రాపై అధిక వ‌త్తిడి పెంచ‌లేమ‌ని గంభీర్ తెలిపాడు. తొలి మూడు టెస్టుల‌కే అత‌న్ని ఎంపిక చేసినా.. మొద‌టి టెస్టు ఓట‌మితో.. ఇంకా నాలుగు మ్యాచ్‌లే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అత‌ని అంశంలో నిర్ణ‌యాన్ని మార్చుకునే అవ‌కాశం లేద‌ని గంభీర్ తెలిపారు. త‌మ ప్ర‌ణాళిక‌ల్లో ఎటువంటి మార్పు లేద‌ని, అత‌నిపై వ‌ర్క్‌లోడ్ ఉంద‌ని, ఈ సిరీస్‌కు రాక‌ముందే ఆ అంశంపై క్లారిటీ ఉంద‌న్నారు. బ‌ర్మింగ్‌హామ్‌లో జూలై రెండో తేదీ నుంచి రెండో టెస్టు ప్రారంభంకానున్న‌ది. అయితే ఏ రెండు టెస్టుల్లో బుమ్రా ఆడుతాడో ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు. త‌మ వ‌ద్ద అద్బుత‌మైన బౌటింగ్ బృందం ఉంద‌ని, దాంట్లో త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని, న‌మ్మ‌కంతోనే జ‌ట్టును ఎంపిక చేస్తామ‌ని, ఆశ‌తో కాద‌న్నారు. లీడ్స్ టెస్టులో అయిదో రోజు ఓ ద‌శ‌లో గెలిచే స్థితిలో ఉన్నామ‌ని, మ‌న బౌల‌ర్లు రాణిస్తార‌ని గంభీర్ పేర్కొన్నారు.

About The Author

Tags

Share On Social Media

Related Posts

Latest News

RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు
RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలో వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద‌సంచల‌న్ కార్య‌క్ర‌మం నిర్వహించారు. చేవెళ్ల గ్రామ రచ్చబండ హనుమాన్ దేవాలయం...
Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు

Advertise