Tag
RTC
మేడ్చల్ 

RTC ఛార్జిలను పెంచడం సరికాదు

RTC ఛార్జిలను పెంచడం సరికాదు పెంచిన RTC ఛార్జిలను తగ్గించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట బస్టాప్ వద్ద నిరసన చేపట్టరు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ., ప్రభుత్వం కొంతమంది పెట్టుబడిదారులకు కోట్లాది రూపాయలు ఇస్తూ, కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడే ఆర్టిసి ఛార్జిలను పెంచడం అంటే ప్రభుత్వాలు ఉన్నవాళ్లకు ప్రజల నుండి వసులు చేసి పెట్టుబడిదారులకు పంచడానికే ఉన్నాయని, ఇది తెలుసుకోలేని ప్రజ వెతిరేక కార్యకలాపాలు చేసే పార్టీలకు ఓట్లు వెయ్యడం ద్వారా ఇలాంటి కష్టాలు వస్తాయని ప్రజలు వాటిని గ్రహించేంత వరకు కమ్యూనిస్టులుగా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి పేద ప్రజల పై భారం పడకుండా నిర్ణయాలు తీసుకోవాలని,వెంటనే పెంచిన ఛార్జిలను తగ్గించి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.
Read More...
రంగారెడ్డి 

ప్రభుత్వం అరెస్టులు - ప్రశ్నించడమే నేరమా

ప్రభుత్వం అరెస్టులు - ప్రశ్నించడమే నేరమా ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా ఈ ప్రభుత్వం అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం అని బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు చిన్నగండు రాజేందర్ హనుమంతు ముదిరాజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో బస్ భవన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న కార్యకర్తలను ముందస్తుగానే హౌజ్ రెస్టు లు చేయడం ఎంతవరకు సమంజసం అని పార్టీ సీనియర్ నాయకులు రాజేందర్ అన్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము లేక నిరంకుషత్వమా మహిళలకు ఫ్రీ బస్సులు అంటూ గొప్పలు చెప్పుకుంటూ బస్సు చార్జీలు పెంచడం దారుణం అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అన్యాయంపై మాట్లాడితే అరెస్టులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. బస్ చార్జీలను విపరీతంగా పెంచి ప్రయాణికుల పై ఈ ప్రభుత్వం శఠ గోపం పెడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చి హామీలు అమలు చేయలేక హామీలపై అడిగితే ఈ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆర్గారంటీల పథకాలను వెంటనే అమలు చేయాలన్నారు.
Read More...

Advertisement