జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు, సుభాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తూ, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు దోర అరుణ్, శ్యామ్, అశ్రఫ్, కరీమ్, వెంకట్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి రాకేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. యువజన నాయకులు జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. యువత ఇటువంటి అవమానకర వ్యాఖ్యలకు ఎదురొడ్డి, ఒక్కటిగా ఏకమై, ఇటువంటి అవమానకర వ్యాఖ్యలను తిప్పికొట్టాలని పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.