Tag
Pathholes
రంగారెడ్డి 

PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు

PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు   చటాన్‌పల్లి బ్రిడ్జ్‌ ఇరువైపులా రహదారికి తక్షణమే మరమ్మత్తులు చేపట్టండి అంటూ స్థానికుల డిమాండ్  షాద్‌నగర్ మున్సిపల్‌ పరిధిలోని బుచ్చిగూడ–చటాన్‌పల్లి సమీపంలోని జాతీయ రహదారి బ్రిడ్జ్‌కు ఇరువైపులా గుంతల రోడ్డు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రతిరోజూ ఈ మార్గం గుండా వేల సంఖ్యలో ఉద్యోగస్తులు, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు వేలాదిమంది ప్రయాణం చేస్తున్నారు. అయితే రహదారి దుస్థితి కారణంగా ప్రయాణం ఒక్కోసారి ప్రాణపాయం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ప్రారంభమైనప్పటి నుండి రోడ్డు పూర్తిగా దెబ్బతిని, చిన్నచిన్న గుంతలు ఇప్పుడు పెద్ద ప్రమాదకర  మార్గంగా మారాయని ప్రజలు వాపోతున్నారు. ప్రతి రోజు ఈ మార్గంలో వాహనాలు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, కొందరు గాయపడి ఆస్పత్రుల పాలవుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
Read More...

Advertisement