ఉరిశిక్ష.. హసీనాను భారత్ నుంచి రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్న యూనస్ ప్రభుత్వం
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh former PM) షేక్ హసీనా (Sheikh Hasina) కు స్థానిక ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT)’ మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌లో రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీటీ తీర్పు నేపథ్యంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆమెను భారత్ నుంచి స్వదేశానికి రప్పించేందుకు (Hasina extradited from India) చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఇంటర్‌పోల్ (Interpol) సాయం కోరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మానవత్వానికి వ్యతిరేకంగా క్రూర నేరాలకు పాల్పడ్డారనే కారణంతో బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాకు (Sheikh Hasina) మరణశిక్ష విధిస్తున్నట్లు ఆ దేశ ప్రత్యేక ట్రిబ్యునల్ సోమవారం తీర్పు ప్రకటించింది. షేక్ హసీనా పరోక్షంలో విచారణ జరిపిన ట్రిబ్యునల్ హసీనా ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన సదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు కూడా ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం వారు భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారి అప్పగింతపై యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇంటర్‌పోల్ సాయం కోరేందుకు సిద్ధమైనట్లు బంగ్లా మీడియా నివేదించింది.
