Tag
Model Code of Conduct violation
Telangana 

పైడిపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత.. నిరసనకారులపై లాఠీచార్జి, గాల్లోకి కాల్పులు

పైడిపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత.. నిరసనకారులపై లాఠీచార్జి, గాల్లోకి కాల్పులు జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 17-12-2025న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తైన అనంతరం, ఓటమి పాలైన ఓ అభ్యర్థి తన అనుచరులు, కొందరు గ్రామస్తులతో కలిసి పోలింగ్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పోలింగ్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తూ బ్యాలెట్ బాక్సులను తరలించకుండా అడ్డుకున్న నిరసనకారులు, పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసన కొనసాగించారు. పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు పోలీసులు సుమారు రెండు గంటల పాటు నచ్చజెప్పినా వారు వినకుండా ప్రతిఘటించారు.  
Read More...

Advertisement