స్ట్రాబెర్రీలను తరచూ తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!
చూసేందుకు ఎరుపు రంగులో స్ట్రాబెర్రీలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తినేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. స్ట్రాబెర్రీలతో సాధారణంగా కేక్‌లు, ఐస్ క్రీములను తయారు చేస్తుంటారు. ఈ ఫ్లేవర్ అంటే చాలా మందికి ఇష్టమే. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తో కూడిన చిరు తిండ్లను కూడా ఎక్కువగానే తింటారు. అయితే ఆరోగ్య పరంగా చూసుకుంటే స్ట్రాబెర్రీలు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు వీటిల్లో ఉంటాయి. స్ల్రాబెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. 80 గ్రాముల స్ట్రాబెర్రీలను తింటే సుమారుగా 26 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. 0.5 గ్రాముల ప్రోటీన్లు, 0.4 గ్రాముల కొవ్వు, 4.9 గ్రాముల పిండి పదార్థాలు, 13 గ్రాముల ఫైబర్, 136 మిల్లీగ్రాముల పొటాషియం, 49 మైక్రోగ్రాముల ఫోలేట్, 46 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటాయి.