త‌వుడును అంత తేలిగ్గా తీసిపారేయ‌వ‌ద్దు.. ఎన్నో పోష‌కాల‌కు నెల‌వు ఇది..!

On
త‌వుడును అంత తేలిగ్గా తీసిపారేయ‌వ‌ద్దు.. ఎన్నో పోష‌కాల‌కు నెల‌వు ఇది..!

ప‌శువుల‌కు దాణాగా త‌వుడు వేస్తుంటార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. త‌వుడులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ధాన్యం పొట్టు క‌నుక ఇందులో అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. కాబ‌ట్టే ఆ త‌వుడును తినే ప‌శువులు ఆరోగ్యంగా ఉంటున్నాయి. కానీ మ‌నం పాలిష్ చేసిన బియ్యాన్ని తింటున్నాం. రోగాల బారిన ప‌డుతున్నాం. అయితే త‌వుడును కూడా తిన‌వ‌చ్చ‌ని ప్ర‌కృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. త‌వుడును నేరుగా తిన‌లేకున్నా దాంతో టీ డికాష‌న్ త‌యారు చేసి తాగ‌వ‌చ్చు. మీరు తినే ఆహారాల‌పై కాస్త చ‌ల్లి తిన‌వ‌చ్చు. ఎన్నో పోష‌కాల‌కు నెల‌వుగా ఉండే త‌వుడును తిన‌డం వ‌ల్ల అనేక లాభాలు ఉంటాయ‌ని పోష‌కాహార నిపుణులు సైతం చెబుతున్నారు. త‌వుడులో ఫినోలిక్ స‌మ్మేళ‌నాలు ఉంటాయి.గుండె పోటు రాదు.. ముఖ్యంగా ఫెరూలిక్ యాసిడ్‌, పి-కౌమారిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా ప‌నిచేస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల శ‌రీరానికి క‌లిగే న‌ష్టాన్ని త‌గ్గిస్తాయి. దీంతో క్యాన్స‌ర్‌, గుండె పోటు వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. త‌వుడులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వాపుల‌ను త‌గ్గించ‌డంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీని వల్ల ఆర్థ‌రైటిస్ నొప్పులు ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం త‌వుడును తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని అనేక క‌ణాలు ఉత్తేజితం అవుతాయి. ఇవి రోగాల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి.జీర్ణ వ్య‌వ‌స్థ‌కు..త‌వుడులో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గిస్తుంది. దీంతో రోజూ సాఫీగా విరేచ‌నం అవుతుంది. పేగుల్లో మ‌లం సుల‌భంగా క‌దులుతుంది. జీర్ణ వ్య‌వస్థ‌లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం త‌వుడును తీసుకోవ‌డం వ‌ల్ల లాక్టోబేసిల్ల‌స్ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గిస్తుంది. అలాగే మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకునేలా చేస్తుంది. క‌నుక త‌వుడును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక దీన్ని తింటే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.కొలెస్ట్రాల్‌కు చెక్‌..త‌వుడులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు వ‌చ్చే ప్ర‌మాదాల‌ను నివారిస్తాయి. త‌వుడును ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా నివారించ‌వ‌చ్చు. త‌వుడు నుంచి త‌యారు చేసే రైస్ బ్రాన్ ఆయిల్ మ‌న‌కు మేలు చేస్తుంది. ఈ ఆయిల్ గుండెకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఫైటో కెమిక‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను ర‌క్షిస్తాయి. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం త‌వుడును ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదం గ‌ణనీయంగా త‌గ్గుతుంది. త‌వుడు వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌వు. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఇంకా ఎన్నో లాభాలు దీని వ‌ల్ల ఉంటాయి. క‌నుక త‌వుడును క‌చ్చితంగా తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

About The Author

Tags

Share On Social Media

Latest News

RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు
RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలో వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద‌సంచల‌న్ కార్య‌క్ర‌మం నిర్వహించారు. చేవెళ్ల గ్రామ రచ్చబండ హనుమాన్ దేవాలయం...
Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు

Advertise