ఇజ్రాయెల్‌ దురాక్రమణను భారత్‌ ఖండించాలి : ఇరాన్‌

On
ఇజ్రాయెల్‌ దురాక్రమణను భారత్‌ ఖండించాలి : ఇరాన్‌

ఇరానియన్‌ ఎంబసీ మిషన్‌ డిప్యూటీ చీఫ్‌ జావెద్‌ హొస్సేనీ మాట్లాడుతూ.. ‘భారత్‌ అధికారులతో మేము చర్చలు జరిపాం. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ విషయంలో భారత్‌ తటస్థ వైఖరితో ఉంది. ఎందుకంటే రెండు దేశాలతోనూ భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇక్కడ ఇరాన్‌-ఇజ్రాయెల్‌ సమస్యకాదు. ఒక దేశంపై దురాక్రమణకు సంబంధించిన విషయం. అంతర్జాతీయ చట్టం ప్రకారం దీన్ని ఖండించాలి. గ్లోబల్‌ సౌత్‌కు ఇండియా లీడర్‌. ఇజ్రాయెల్‌ దాడులను న్యూ ఢిల్లీ వ్యతిరేకించాలని ఇరాన్‌ ఆశిస్తోంది. భారత్‌తోపాటూ ప్రతి దేశం ఇజ్రాయెల్‌ దాడులను ఖండించాలి’ అని పేర్కొన్నారు.

 

మరోవైపు జ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో తమ దేశంలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యుద్ధం వల్ల మూసి ఉంచిన ఇరాన్‌ గగనతలాన్ని భారత విమానాల కోసం తెరిచింది. ఇరాన్‌లో చిక్కుకుపోయిన మన విద్యార్థులు, పౌరుల కోసం కేంద్రం ఆపరేషన్‌ సింధూ ప్రారంభించింది. అందులో భాగంగా సుమారు 1000 మందిని మూడు విమానాల ద్వారా భారత్‌కు తీసుకు వస్తున్నారు. అందులో మొదటి విమానం శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుందని అధికారులు చెప్పారు. ఇరాన్‌ నుంచి రావాలనుకున్న మన వారందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు .

Tags

Share On Social Media

Related Posts

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise