ఇజ్రాయెల్ దాడుల్లో 40 మంది పాలస్తీనియన్లు మృతి
హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. గాజాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆసుపత్రి వర్గాలు తాజాగా వెల్లడించాయి. అనేక మంది గాయపడినట్లు తెలిపాయి. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి.ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 2023లో ప్రారంభమైన విషయం తెలిసిందే. 21 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఒత్తిడి చేస్తున్నారు. అయినా చర్చల్లో ఎలాంటి పురోగతీ కనిపించట్లేదు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ రెండు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు భేటీ అయ్యారు. బైట్‌హౌస్‌లో నెతన్యాహుతో సమావేశమయ్యారు. యుద్ధం ముగింపు, బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం వంటి అంశాలపై చర్చించారు.