ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించాలి..

On
ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించాలి..

పరకాల: ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూఎస్సీ వర్గీకరణను ఏబీసీడీలుగా వర్గీకరించాలన్నారు. వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని, లేకపోతే 57ఉప కులాలకు చెందిన వారు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో అవకాశాలు కోల్పోతారని చెప్పారు.అణగారిన వర్గాలకు కూడా వర్గీకరణ ఫలాలు దక్కాలన్న ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏబీసీడీలుగా వర్గీకరించి ఆమోదింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు హనుమకొండ విజయ్, కొయ్యడ అఖిల్, తిక్క రాజు, నాగెల్లి రఘు, కొయ్యడ జశ్వంత్, కొయ్యడ కొమరయ్య, కొయ్యడ రాజేష్, శ్రీపతి శివాజీ, తిక్క యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు. 

Tags

Share On Social Media

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise